పుట:Saptamaidvardu-Charitramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

సప్త మైడ్వర్డు చరిత్రము.


ములను కొనసాగింతు రనికోరు చున్నారము." అను మొదలగుసంగతులు వ్రాసినపత్రికను ఆతని హస్తపల్లవంబున నిడెను.పార్లమెంటుక్లార్కు- ఎడ్వర్డునకుఁ గొన్ని ప్రమాణ వచనములను జెప్పెను. ఎడ్వర్డు దానిని ప్రభువుల యెదుట స్ఫుటముగఁ బలికెను. ఆంత నాతఁడు "కార న్వాలు ప్రభు పనియును, (Duke ofCornwall) ఛెసరునకు స్వామి అనియును, (Earl of Chester) కారిక్కునకు నొడయఁ డనియును, (Earl of Carric )రో దుసేకు నేలిక అనియును (Duke of Rothesay) లంకల ప్రభువనియును (Lord of the Isles) ప్రభువులు సెప్పిరి.పార్లమెంటు సభాసభ్యులలో రెండు తరగతులవా రుండిరి ఒక తరగతివారు ప్రాచీనాచారములును, చట్టములును, మేలై నవియును, వానిమార్చగూడ దనియును, చెప్పువారు.వీరికి "కంజర్వటీసు అని పేరు. రెండవనారు. ప్రాచీనాచారములలో మే లైన వానిని గ్రహించి, పనికి రానివానిని బోఁ ద్రోసి క్రొత్తవానిని నిర్మించి, వానిని ఆచారమునకు; దెచ్చి ఇంగ్లండున నుండు సన్న గాండ్రను తమతో సమానులుగఁ జేయుటకు నుద్యమించువారు. వీటికి "లిబరల్సు " అని పేరు. ఎడ్వర్డు ఈ రెం డు కక్షల వారిలో చేరక ప్రత్యేకముగ నుండి వీరివాదంబులనాసభలలో వినుచుండెడి వాడు. అయిన నాతఁడొకతడవమాత్రము " పెండ్లమును గోలుపోయనవాడు చచ్చిన పెండ్లము చెల్లెలిని క్రమ్మఱ వివాహము సేసికొనవచ్చును." అనుచట్టము