పుట:Saptamaidvardu-Charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ల వ అధ్యాయము,53


టీని బంపించెను. ఎవరును ఎలాటి కోఱతలు లేక " డెనార్కురాజుపుత్రిక యగునలెగ్జాండ్ర రాకకు నెదుఱు చూచు చుండిరి..ఇంగ్లండు పెక్కు భాగములుగ విభజింపఁబడి యున్నది.. ఒక్కొక్క దానికి “కౌంటి" అని పేరు. అట్టిదానిని మన రాజ్యమున “జిల్లా " అని పలుకు చుందుము. అచ్చట బ్రతి కౌంటియందును, వ్యాపార సంఘములు, వ్యవసాయదారుల సంఘ ములూ, నగర పాలకుల సంఘములు, (Municipal Bodies),గొప్ప గొప్ప జమీందారులు, మొదలైన సంఘములును, జనులును, పత్రికాముఖంబునఁ దమ తమ రాజభ క్తిని దెలుపుటను, ఎడ్వర్డు సంప్రీతిని గొని వానందఱుకు నుచిత భంగినిసత్కారములు సలుప వలసియుండెను. అతఁడు పార్లమెంటు సభసభ్యులకుఁ దాను వివాహ మాడఁ బోవు చున్నా ననితెలియఁబడు టకు నాసభలోఁ బ్రవేశించి వారియంగీ కారమునొందవలసి యుండెను. అతడాపనుల నన్నింటిని స్వయముగఁ జేసికొనెను. అతఁడు రాజ చిహ్నములచే నలంకృతుఁడై పార్లమెంటుసభలో బ్రవేశించెను.

ప్రభువులందురును లేచిరి. కాని లార్డు చాన్సలరుకు మాత్రమతి గాంభీర్యమున దనయాసంబునఁ గూర్చుండి యుండెను.ఎడ్వర్ణాతని డాయంజని " మేము డెన్మార్కు నొడయనిపట్టి యైన అలెగ్జాండ్రాను వివాహ మాడఁబోవు చున్నారము. ప్రభుపులందఱును మాకల్యాణ సమయమున విచ్చేసి, సమస్త కార్య