పుట:Saptamaidvardu-Charitramu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

సప్తమైడ్వర్డు చరిత్రము.


భువుల నాతడు గౌరవించి వారి నాదరింప వలసి యుండెను.అతని కల్యాణమ ఘోత్సవమును జూడ సాముత ప్రభువర్గములును శ్రీమంతులై నవ కనికరంబులును, అతని రాజ్యంబు నాతని మాటుగఁ జాలించు రాజు ప్రతి నిధుల సమూహంబులును,సామాన్య జనంబులును, ఎన్ని యోమంది "లెక్క కుమిక్కిలి యై లండనువురి వైభవము హెన్నతముగ నానాదేశంబులయందు బెల్లుగ సల్లుకోనునటులం జనుదెంచు చుండిరి. వారు వారు తమకు నియమించి విడిదులలో బస చేసిరి.. హిందూదేశము, కన్నడా, ఆస్ట్రేలియా, కేవు కాలని మున్నగు రాజ్యంబులయం దలి సేనలును, సేనానాయకులును, లండను పురికి చేరిరి. రాణీ మంత్రులే యేవారల యేరీతుల నాదరింప వలయునో ఆయావారల నాయారీతుల నాదరించుటకు వారివారి హోదా లకుఁ దగిన పరివారమును ఏర్పాటు చేసిరి. 'వారందరునుఎడ్వర్డు కళ్యాణ మహోత్సవమును గాంచుటకు సతికుతూహలులై యుండిరి,

రాణి తన వియ్యంకునకును, వియ్యపురాలికిని, వారిపరిజనములకును, దిగిన బసలను ఏర్పాటు చేసెను. వారిలోబెక్కు మంది వారి వారి కుటుంబములతో ముందుగ " విచ్చేసి యుండిరి. రాణి మంత్రులు వారికి నే కోదువ లేకుండునటుల వారికి వలయు సామానులను ఆంద జేయు చుండిరి. . డెన్మార్కు- ప్రభువు తసజన సమూహములకుఁ గావలసిన సామగ్రుల సన్నిం