Jump to content

పుట:Saptamaidvardu-Charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా లవ అద్యాయము,

51


చిగురాకు బోడీని జేఁబట్టఁ బోవు చున్నాడు. పెండ్లి వేడుకలను జూడ ననేక దేశములయందుండి అనేకులు వత్తురు. "పెక్కుసరకులు విక్రయమునకుఁ బోవును. ద్రవ్యమును సంపాదించుటకు నిదియే మంచిసమయము, జాగు సేయకూడదు. అన్ని సామాను లను జేర్చుకొనుట లెస్స" అని వర్తలండఱకు ఆయావస్తువులు విక్రయమునకుఁ నెచ్చి పెట్టుకొనిరి. వీదు లూడ్చుకొని జీవించువాడు మొదలు రాణిమంత్రిపదంబుసనుండినవారి వఱకుఁ గలజనులందఱును తమతమమందిరంబుల సర్వవిధంబుల సలంకరొంచుకొనిరి. పరదేశములనుండి పరిణయవినోదంబలం గాంచుటకు నేతెంచుగోప్పవారును, శ్రీమంతులును, హీందూ దేశ మున నుండిన సామంత ప్రభునికరంబులును, తమకు నాపట్టణంబున నాతరుణంబున బస సేయుటకుఁ జోటు లభింపదనియెంచి, మున్ముందుగ నద్దెకు నియ్యవలసిన పైకమును బంపి, బసలను ఏర్పాటు చేసికొని యుండిరి. రాణిమంత్రులును వేవేగ నైరోపొఖండంబున నుండు చక్రవర్తులకుఁ దగిన మేడలును నియమించి "నా దేహసౌఖ్యములకు భంగము లేవియు లేకుండం జేయుటకుఁ బెక్కు మంది సేనకులను నియమించిరి. పనులన్నియు ముగియ గశ్యాణకళలచే లండనునగరవరము పెంపొందు చుండెను.

ఎడ్వర్డు తండ్రిపోయిన దాదిగ రాచ కార్యములు చేయు చుండెను. పరదేశములనుండి రాణిఁ జూడ నే తెంచిన ప్ర