పుట:Saptamaidvardu-Charitramu.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

31


లండనుపురంబున నుండు " హైడ్ పార్కు " అనునుద్యానవనము మిక్కిలివిశాల మై రమణీయ మైనపచ్చని చెట్లచే నిబీడీకృతం బై ఉండును, ఆల్బర్టు ప్రభువు తనకుమారుఁడు లోక మునందు కల చిత్రనస్తువుల సన్నింటిఁ జూచి వానిస్వభావమునునేర్చుకొనుటకు వీలగునటుల నొక సర్వవస్తు ప్రదర్శనశాలను 1851 సం. న ఆ వనంబునఁ గట్టించెను. అతఁ డందు నిండున జేసినవియును, ఐరోపా, అమెరికా, ఆసియ మున్నగు ఖండుబులలో నుత్పత్తి యైనవియును, ఆయా దేశస్థుల బుద్ధికుశలతవెల్లడి యగునటులఁ జేయఁబడి సవియును, అయినవస్తువులను సంపాదించి నరుస నుంచెను. ఆశాల యుద్దము చేఁ గట్టంబడి,చూపఱకు నధిక సంతోషము 'నెసఁగుచుండిన దై చెన్ను మీరె.పార్లమెంటు సభాసభ్యులతో బెక్కుమంది. దానిని నిర్మించుట వల దనిరి. ఎ.ందరెన్ని మాటలు పల్కినను, ఆల్బర్టు ప్రభువువారిమాటల నాలకింపక ప్రదర్శనశాలను నిర్మించెను. శ్రీమహారాజీ తనయునిఁ గూఁతులను వెంట నిడుకోని నాల్గుగుఱ్ఱబుల బూన్చినశకటంబుల నెక్కి భర్తప్రక్కఁ దాఁ గూర్చుండి ప్రదర్శన శాల కరుదెంచెను. లండను రాజమార్గంబులజనులు వారిని

వీక్షించి ప్రమోదభరితు లైరి. మంత్రులును, పార్లమెంటుసభ్యులును, రాణిని, ఎడ్వర్డును, మిగుల గౌరవించి, ప్రదర్శనశాలను 'దెజపఁ బ్రార్థించిరి, రాణి వాని వేడుకోలును వ్యర్థపుచ్చ నొల్లక ప్రదర్శనమందిరంబును దెరుచుట కంగీకరించెను. ఆవల