పుట:Saptamaidvardu-Charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

సప్త మైడ్వర్డుచరిత్రము


తండ్రి వెంట నాతనిని కోల్ యక్స్ చేంజ్ భవనము దెరువఁ బంపెను. లండను నగర నాసు లాకొమరుని వీక్షింప రాజమార్గంబుల నీరు కెలంకుల గుంపులుగూడి యుడి. అతఁడు తనతం డ్రి వెంట నామందిరంబు సమీపించెను. ఆల్బర్టు ప్రభువు తనకుమారుని ముందు నిలువఁ బెట్టి యాతనిచే నాళ వనంబును దెఱపించెను. ఒక నాఁడు రాణి తన బిడ్డలతో ఆస్బోర ననుభ వనంబున నుండెను, ఉద్యానవ సంబున నుండుపక్షుల వేఁటాడుకోరిక తోనెడ్వర్టు ఆయుధపాణు లైన యనుచరులు వెంట రానావనంబు సంగ్రుమ్మరు చుండెను. అతఁ డేయాయుధమును గొనిపోలేదు.అతని యనుచరులు మాత్రము పక్షులను గాల్చుచుండిరి. ఎడ్వర్డు పసివాఁ డైనందున చెట్టునుండి క్రిందఁబడి మరణావస్థలో నుం డిన పక్షి నొకదాని నెత్తుకొని వచ్చుటకు ముందుఁ బరుగిడెను.కానింగుప్రభు వీబిడ్డఁ దాని దాపునకు వెళ్లినది యెఱుంగక తుపాకు గుకి వెట్టి కాల్చేను. ఇంతలో నెడ్వర్డు కు నపాయము క లుగు సని యెంచి యొక శూరుఁడు దానికడ్డముగ నిలిచెను. ఆకాల్చినతుపాకీ వాని చొక్కాను జించుకొని పోయెను. కానిఎడ్వర్డున కెంతమాత్రము కీడు రాలేదు. 'రాణియును, ఆల్బ ర్టు ప్రభువును, ప్రభువు కానింగును, మున్నగువారు ఎడ్వర్డు ప్రాణాపొయమైన దెబ్బ వలనఁ దప్పించుకొనె ననీ సంతసిల్లి హనిప్రాణమును గాపాడిన వానికిఁ దగిన బహుమతుల నొసంగిరి,