పుట:Saptamaidvardu-Charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము,

29


రాజమార్గంబులఁ బచ్చని తోరణంబులచే సలుకరింపబడి యుండె. అచ్చట నేల్లెడెల జూచినను 'వేన వేలుజనులు గుంపులు గూడి ఎడ్వర్లు రాకవలనఁ దమకుఁ గలిగిన సంతసమును ముచ్చ టించుకొను చుండిరి. ఎడ్వర్డు వారీదీవెనల నందుకొనుచుఁదల్లిదండ్రులతోడను, సోదరుల తోడను, తనతల్లి ప్రతినిధిగారి యింట బస సేసి అచ్చట నుండునుద్యానవసంబులను, ట్రినిటి సర్వకళాశాలను, మున్నగుచోటును గాంచి హర్షించెను.రాణి ఆపురి పౌరులకు విందు నొనర్చి యొక నా డాపురి రాజమార్గంబు బుల నాపౌరులు సంతృప్తి జెంద దనకొడుకు నందురు వీక్షించురీతి నాతని డనముందు ననుకోని యూ రేగేను.ఎడ్వ ర్డాపురిని విడిచి తలిదండ్రులును, తోబుట్టువులును, తనవెంట రా స్వరాజ్యమునకు నే తెం చెను. రాణి తనతనయునకు"అరల్ ఆఫ్ డబ్లీజ్ " అను బిరుదు -నొసంగె. ఎడ్వర్డీరీతిని బౌల్యదశలో నే తసజనుల నప్పుడప్పుడు వారివారి తాపులకుఁ జను దెంచి చూచు చుండుట చే నాతడు ప్రభు వైనపిమ్మట"రాతనియెడ దృడానురాగము కలవారై వర్దిల్లిరి.

1849 సం. న అక్టోబరు నెలలో రాణికి దట్టమ్మ వారుబోసెను. అప్పుడు కోల్ యక్స్ చేంజ్ " అనుభవనము క్రొత్తగా గట్టబడియుండె, అదే వేరి దానిని దెరువ వలసి యుండెను. కాని ఆయము తట్టమ్మవారిచే బాధపడుచుండినందున నాదేవేరితనకుమారు డెడ్వెర్డాపని సేయుటకు నర్హు డని యెంచి అతని