పుట:Saptamaidvardu-Charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ఆధ్త్యాయము

31


లండను పురంబున నుండు "సైడ్ పార్కు" అనునుద్యానవనము మిక్కిలివిశాల మై రమణీయ మైన పచ్చని చెట్లచే నిబిడీకృతం బై ఉండును. ఆల్బర్టు ప్రభువు తనకుమారుఁడు లోక మునందు కలచిత్ర నస్తువుల సన్నింటిఁ జూచి వానిస్వభానమునునేర్చుకొనుటకు నీ లగునటుల నొక సర్వవస్తు ప్రదర్శనశాలను1851 సం. న ఆ వనం బునఁ గట్టించెను. అతఁ డందు నింగ్లండున జేసినవియును, ఐరోపా, అమెరికా, ఆసియా మున్నగుఖండంబులలో నుత్పత్తి యైనవియును, ఆయాదేశస్థులబుద్ధికుశలతవెల్లడి యగునటులఁ జేయ బడిననియును, అయిన వస్తువులను సంపాదించి వరుసగ నుంచెను. ఆశాల యద్దము చేఁ గట్టంబడి,చూచుటకు నధిక సంతోషము ఒసంగుచుండిన దై చెన్ను మీరె పార్లమెంటు సభాసభ్యులలోఁ బెక్కు మందే దానిని నిర్మించుట వల దనిరి. ఎందరెన్ని మాటలు పల్కినను, ఆల్బర్టు ప్రభువువారిమాటల నాలకింపక ప్రదర్శన శాలను నిర్మించెను. శ్రీమహారాష్ట్ర తనయునిఁ గూఁతులను వెంట నిడుకోని నాల్గు గుఱ్ఱబు లఁ బూన్చినశకటంబుల నెక్కి భర్త ప్రక్క ఁ దాఁ గూర్చుండి ప్రదర్శన శాల కరుదెంచెను. లండను రాజమార్గంబుల జనులు వారిని వీక్షించి ప్రమోదభరితు లైరి. మంత్రులును, పార్లమెంటు సభ్యులును, రాణిని, ఎడ్వర్డును, మిగుల గౌరవించి, ప్రదర్శనశాలను దెఱపఁప్రార్థించిరి. రాణి వారి వేఁకోళ్లును వ్యర్థపుచ్చనొల్లక ప్రదర్శన మందిరంబును దెఱచుట కంగీక రించెను. ఆవల