పుట:Saptamaidvardu-Charitramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ఆ ధ్యాయము

23

.

శ్రీవిక్టోరియా ఆల్బర్టుల మనస్సు కెక్కు-నటుల వర్తించి, వారి'మెప్పు వడ సెను. ఆ చిఱుతలును, ఆముసలిది తమ్మువదలి వెళ్లుటను ఒల్లక కన్నీరు వరద లై ప్రవహింప నేడ్చిరి. కాని ఆవృద్ధు రాలు వార్ధక దశలోఁ బాటుపడ లేక విశ్రాంతి పొందఁ గోరి,రాచబిడ్డలకు దాదీయై ఉంట మానుకో నెను. సారవంత మగు నేల సదా మంచిపంట నిచ్చు చుండును, లోకములో మంచి దంపతు లని ఏయాలుమగలఁ జెప్పవచ్చును? గృహస్థునకుఁ దగినయిల్లాలును, ఇల్లాలికిఁ దగిన గృహస్థుఁడును, చేరి, యన్యోన్య ప్రీతిని మెలఁగి యేఁటేంట; గాకసోయినను రెండేండ్ల కొకతడవ యైన. "ఒక బిడ్డను గనుచుగన్న బిడ్డలు సురక్షితముగఁ జిరాయువ్రు లై యుంటఁ గాంచి సంతసించుచు నుందు లేని వారి దాంపత్య మన్నీ విధములఁ బొగడఁదగినది. ద్రవ్యమున్న నేమి ? లేకున్ననేమి ? ద్రవ్యయము శాశ్వతమా ? బీదఱికము శాశ్వతమా ? మన మొప్పటికీ జరజీవు లమై యుండు వారమా ? బీద సంసార మైనను లేదని మగని నలయింపక అతఁడు దెచ్చిన దానిని గుట్టుగ సంబలీగనో సంక టీగనోకాఁచి చేసి వానికి నిడి తాను కుడిచి బిడ్డలను గనుచు మనుగడ గాంచునదియే మంచి యిల్లాలు.

విక్టోరియా రాష్ట్ర భర్తయగు నాల్బర్టును పర దేశమునుండితన యింటిలోఁ గడుపుకూటి కై యిల్లంట్రముండఁ జనుదెంచినమగనికై వడిఁ దలపక ఆప్రభువు. ప్రేమించి ఆయనమనోరథ