పుట:Saptamaidvardu-Charitramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

సప్త మైడ్వర్డు చరిత్రము,


ప్రకారము తానే వేళవర్తించు నాతని సుఖ మే తన సుఖమని తలంచి, మిక్కిలి కూర్మితో నాతనియెడఁ బ్రవర్తించు చుండెను.1848 సం. న విక్టోరియామహారాజ్ని క్రమ్మర గర్భవతి యై యేప్రెలు నేలలో నొక యాడు బిడ్డనును గనెను. ఆమె పేరు ప్రిన్సన్ అలైన్ రాణి పెద్ద కూతురును, పెద్ద కోమరుడును, లిటిల్టన్ దొరసాని స్వాధీనమున ““ వింజురు " గ్రామంబుననుండిరి. కాని యా రాజులంతులు తమ ప్రియశిసువులఁ జూడక యుండనొల్లక వింజరులో సుండినకూతుఁ గొడుకుఁ బిలువ నంప వారును లిటిల్టన్ దొరసాని వెంట: దమతల్లికడకు నేతెంచిరి. ఆమహారాణి రాచకార్యము లెన్ని యుండినను, లిటిల్టన్ దాదియెంత గారాబాముతోదన శిసువులను బెంచు చుండినను తానుస్వయము వారిని విచారింపక యుండిన నెన్నడును లేదు. అదేవేరి తన భర్తతో రాచ కార్యముల నిర్వర్తించుకోనుచుడనబిడ్డలు యాటపాటలను గాంచి యాసందసౌఖ్యంబులబొరయుచు నుండెను.

లండను నగరమున నా విక్టోరియా మహా రాణి భర్తతోను తన బిడ్డలతోను 'కాలము సుఖముగ ,గడుపు చుండెను. 1844 వ,సం. న ఆల్బర్టు ప్రభు వు పరలోక గతుడయ్యె. రాణి తండ్రి మరణమునకై వగ చెడితన ప్రాణసఖుని ఊరడించి యతని దుఃఖము శాంతిల్లఁ జేసెను. అప్పుడప్పుడ నేక రాజ్యముల యందుండి హాస్య గాండ్రును, నర్తకులును, పాటకులును పెక్కు