పుట:Saptamaidvardu-Charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

సప్త మొడ్వర్డు చరిత్రము.


మిట్టి దని అతఁడు నేర్వవలసియుం డే. ఇంతియకాదు.. అతఁడు రాజనీతి యును, సమస్తశాస్త్రములను, నౌకాశాస్త్రమును,విలువిద్యయును, ఎఱుఁగవలసియుండె. ఇన్ని శాస్త్రములు, దెలిసినపండితుఁడు రాణికి లభించునా? లోకములో నిన్నియు నొక్కనికి తెలియునా? ఆఱు నెలల బాలుఁ డిన్ని వివిద్యలు నేర్చుకొన గలడా రాణిగా రివన్నియు దీర్ఘముగ భర్తతోను మంత్రులలో ప్రధాను. డైనమెల్ బోరన్ ప్రభుపుతోను, తన నాథునకు నంతరంగ మిత్రుఁ డైన స్టాకుమరుతోను, బాగుగ నాలోచించి, రాకోమరుఁ దేండ్ల వాఁడగుదాక వానిని బెంచుటకు మంచి తెలివి తేటలు కలదానిని నియమించుట లెస్స అని తీర్పు నే సె., అనేకు లాయుద్యోమునకు దర ఖాస్తులను బంపిరి. కానీ వారిలో లిటల్ టన్" ప్రభువు భార్యామణియును, రెండవ "స్పెన్సర్ ప్రభువు పుత్రికయును, అయిన " లేడీ లిటిల్ టన్ " అను చేడియను తన బిడ్డలను సాకుటకు విక్టోరియా మహారాణి తనహృదయేశు సమ్మతిని బొంది నియమించెను.

1842 సం. న ఏప్రిలు నేలలో నారాచు బొట్టె బెంచుటకు నాలిటిట్టను దాదిగ నమరి ఆహోదాలో బొమ్మిదేండ్లుండి, 1852 సః న ఈ యుద్యోగమును వదిలి, 1870 సం. 3. దీర్ఘనిద్రః జెందె. ఈ తొమ్మిదేండ్లలో నానారీమణి రాణీగారి బిడ్డలనుపోకిరీల డాయం బోనీక మిగుల జూగరూకతతో వారిని సాకి,