పుట:Saptamaidvardu-Charitramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి అధ్యాయము.

5

హెన్రి కాథరైను, అనిబొలియను, జేన్ సేమూరు, అను మువ్వురు పూఁబోడులను వివాహమాడి వారియందు వరుసగ మేరి, ఎలిజబెత్తు, అను కొమారితలను, ఆఱవ యెడ్వర్డు అను కుమారుని బడసెను. వెనుక ఆఱవయెడ్వర్డు ఇంగ్లండునకు నొడయఁ డయ్యె. అతనికి బిడ్డలు లేనందున నాతని తోఁబుట్టువులలో, బెద్ద దగుమేరీ రాజ్యలక్ష్మిని జేఁబట్టెను. ఆవనిత నిరపరాధు లగుప్రాటస్టెంటు క్రైస్తవులఁజంపించినందున బహు క్రూరురా లని పేరు పొందెను. ఈయమకు పిమ్మట నెలిజబెత్తు ఇంగ్లండును బాలించెను. ఈరాణి పెండ్లియాడకయే పరలోక గతురా లయ్యె. ఈమెకాలమున నింగ్లండు మహోన్నత పదవికి వచ్చెను. ఇంగ్లండునుండి హిందూదేశమున వ్యాపారము సేసికొనుటకుఁ దూర్పిండియా వర్తకపుసంఘమునకు ననుజ్ఞ నిచ్చినది ఈ యెలిజబెత్తను రాణియే సుమీ  ! ట్యూడరువంశస్థు లీమెతో నంతమొందిరి.

ఎలిజబెత్తు వెనుక స్టూవర్టువంశస్థు లింగ్లండునకును స్కాట్లండునకును బ్రభువు లైరి. వారిలోఁ జేమ్సు ప్రథముఁడు. ఇతని యనంతరము మొదటి చార్లసు. జను లీతనిఁజంపి, తామే రాజులేకుండ ఇంగ్లండును బాలించిరి. కాని వారిలో మేటి క్రాంవెల్. అతని వెనుక అంతగొప్ప శూరుఁడు లేనందున జనులు మొదటిచార్లెస్ పెద్దకుమారుని రెండవఛార్లెసును బిలిచి యారాజ్యమును బాలింపు మని ప్రార్థించిరి. అతఁడు