పుట:Saptamaidvardu-Charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

సప్తమైడ్వర్డు చరిత్రము

వారి వేఁడుకోలునకు నియ్యకొని నెమ్మదిగ నింగ్లండును బాలింపఁ బూనెను. అతని యనంతర మాతని తమ్ముడు రెండవ జేమ్సు రాజ్యమును బాలించెను. అతనికి మేరి, యాని అను నిద్దఱు కుమార్త లుండిరి. అతని పిమ్మట నా మేరి తనమేనయత్తకుమారుఁ డగుమూఁడవవిల్లియమును బెండ్లియాడెను. ఆయిద్దఱకు శిశువులు లేరు. "యాని" అను నాయమ యింగ్లండును బాలించెను. కాని ఆరాణికి సుతులు లేనందున మొదటి జేమ్సు మనుమరాలి కొడుకు మొదటిజార్జి యింగ్లుడునకుఁ బ్రభువాయెను.

ఈ జార్జి హానోవరు. వంశస్థులలో మొదటి వాఁడు. ఇతఁడు పదుమూఁడేండ్లు ఇంగ్లండును బాలించెను. ఇతని యనంతరము రెండవజార్జి రాజ్యమునకు వచ్చెను. ఇతని కాలమున హిందూదేశమున బంగాళారాజ్యమును క్లైవు 1757 సం. న జయించెను. ఆంగ్లేయ దొరతన మది మొదలుకొని హిందూ దేశమున బాగుగఁ జెల్లుచు నున్నది. రెండవజార్జి వెనుక మూఁడవజార్జి ఇంగ్లండునకు స్వామి యై యఱువదియేండ్లు రాజ్యముసేసి కీర్తిశేషుఁ డయ్యె. ఇతని కాలమున నాంగ్లేయులు అమెరికాలోని సంయుక్త రాష్ట్రమును (United States)గోలుపోయిరి; ఇంగ్లండు వ్యాపారమును జేతివృత్తులలోను మేటి యయ్యె ; అయిరోపాఖండంబున నెపోలియ నను బలపరాక్రమ శేముషీమంతుండువాటర్లుయుద్ధమున నోడెను. నాలవజార్జి రాజ్యమునకు వచ్చి