పుట:Saptamaidvardu-Charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

సప్తమైడ్వర్డు చరిత్రము

హెన్రి ఫ్రాన్సు రాజ్యమునకు వెళ్లి యచ్చటఁ జాలినంతసేనను జేర్చుకొని యింగ్లండునకు వచ్చి నాలవయెడ్వర్డును బాఱఁదోలి సింహాసనమును బడసెను. అయిన నేమి? ఎడ్వర్డు రహస్యమున నాఱవహెన్రీని జపించి తాను సింహాసనమును బొందెను. ఈయెడ్వర్డునకు నైదవయెడ్వర్డును, రిచ్చర్డును, అనుకుమారు లిద్ద ఱుండిరి. వారు వానివెనుక రాజ్యమునకు రానర్హులై యుండిరి. కాని వారు మిక్కిలి పసికూన లైనందున జనులు వారిపినతండ్రి యగుమూఁడవరిచ్చర్డును వారిమాఱుగ నింగ్లండును బాలింప నియమించిరి. అతఁడు మిగులక్రూరుఁడును, దురాశాబద్ధుఁడును, అయి యుండినందున నాచిఱుతలను జెఱసాలలో నుంచి యచ్చట రహస్యముగ వారిఁ జంపించెను. ఈ మూఁడవిరిచ్చర్డు నోరులేనిపసికూనలను జంపించినందున, జనులు వానియెడఁ గోపము కలవారై వానిని ద్వేషించి యుండిరి. ఇంతలో నేడవహెన్రి మూఁడవరిచ్చర్డును యుద్ధంబున మట్టుపెట్టి తాను రాజ్యమును బొందెను.

ఈ యేడవహెన్రి ట్యూడరువంశస్థులలో మొదటివాఁడు. ఇతనికి నార్థరు, ఎమిదవహెన్రి, అను నిద్దఱు కుమారులును మార్గరట్టు అనుకొమార్తయును బుట్టిరి. వారిలో నార్థరు స్వర్గస్థుఁ డయ్యె. ఎనిమిదవహెన్రి తన తండ్రివెనుకఁ దాను రాజ్యమునకు వచ్చెను. మార్గరట్టు స్కాట్లండు భూస్వామి యగు నాలవ జేమ్సును వివాహ మాడెను. ఎనిమిదియవ