పుట:Saptamaidvardu-Charitramu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

సప్త మైడ్వర్డు చరిత్రము.


శులు సేరెను. ఎడ్వర్లు జ్యేష్ఠపుత్రిక " ప్రిన్సస్ రాయల్ (Princess Royal) అనియును, ఆయమబిడ్డలు రాజవంశం బునఁ జేరిన వారనియును, చాటింపఁబడెను..

నార్వే రాజ్యమును, స్వీడను, ఏకమై ఉండెను కాని, ఆరెంటిలో నార్వే రాష్ట్రము వేఱు పోయెను. దానికి డెన్మా ర్కు రాకోమారుఁడు చార్లెస్ అను నాతడును, ఆయస భార్య యును, ఎడ్వర్డుకూఁతును అయిన మాడ్లను రాచ పట్టియును, రాజును, రాణీయును, అయిరి. ఈ రాజదంపతు లిరువురు నార్వే రాజ్యలక్ష్మిని బొరసి దాని పాలింప సాగిరి.

షేఫీల్డులోఁ గట్టిన సర్వ కళాశాలా భననంబులను, మాం చెస్టరునుండి సముద్రము వఱకు ద్రవ్విన కాలువను, లండను నగరంబునఁ గొత్తగ 'నేర్పఱచిన కింగ్సు వే, ఆల్డ్ విచ్ అను రాజవీధులను, ఎడ్వర్డు తెఱిచెను. అతడు రణ శాస్త్రము నభ్యసించెడి బాలురను కొందఱను బరీక్షించి సెంటు మార్టిన్ స్లీ గ్రాండులో (St Martin's - le - Grand) తపాలా శా లకు నస్తీభారమును వేసెను.

1906 సం. న లిబరులును, లేబరు పార్టీ వారలును జయ ప్రదు లై ప్రభుత్వమును వహించి. సర్ హెన్రికాంబల్ బాన ర్ మా నను నాతడు మంత్రిపదంబున నెలకొనెను. ఎడ్వర్డు సమస్త దేశ రాజులలో లేని పోనికలహలములలోఁ బ్రవేశింపక నెమ్మదిగఁ బృద్విని పాలించు వా డని చిర కీర్తి సంపాదించెను.