పుట:Saptamaidvardu-Charitramu.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

146


చెను. ఇందు వలన నాంగ్లేయులకును జర్మనివారికిని, గలచుట్ట ఱికము బాగుగ వర్ణిల్ల సాగెను.

1905 సం, న ఎడ్వర్డు విశేషఘన కార్యము లొనర్చిన టులఁ గాన్పింప లేదు. కాని అతఁడు అయిరోపా ఖండ మందలి పర రాజులతోఁ జెలిమిని బలపఱుచు నుండెను.

ఎడ్వర్లు మధ్య ధరాసముద్రమున నుండు లంకలను గాంచి వచ్చుటకుఁ బయనము సేసెను. అతఁడు తనకు ముందుగ వెళ్లిన అలెగ్జాండ్రాను మార్సేల్సులోఁ గలిసికొనెను, అతఁడు ఫ్రాన్సు రాజ్యపు టోడయనిఁ జూచి మధ్యధరా సముద్రముండలి వర్జీనియా మున్నగు లంకలకుఁ జను దెంచి, ఆయా తావులలో నుండు జనులొసంగు సపర్యలను గైకొని భార్యాసహితుఁ డై తన గీమునకు "నేతెంచెను.

జూలై నెలలో సముద్రమునఁ బోరుసలుపు నాంగ్లేయ నౌకావీరులు "ఫ్రెంచి వారి దేశమునకు నేఁగి వారిచే విందులు గొని క్రమ్మఱ నింగ్లండునకు నచ్చిరి. ఆగస్టు నెలలో ప్రెంచి వారి యుద్ధ నావ ఆంగ్లంమునకు వచ్చెను. ఎడ్వర్డు ప్రభృతులు వానిని గని ప్రమోదభఃతాంతరణగు లైరి. ఫ్రెంచి వారి యుద్ధ వీరులకు లండను పట్టణంబు విందులు నడిచెను.పార్లమెంటు సభాసభ్యులు వారిని మిక్కిలి అభినందించిరి.

నవంబరు నెలలో నెడ్వర్డు జన్మదిన మహోత్సవము జరి గెను. ఇంగ్లండు రాజ్యమునకు మేలు చేసిన వారికి బిరుదావ