పుట:Saptamaidvardu-Charitramu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

143


యయ్యెను. నవంబరు నెలలో ఇటలీ దేశాధీశుం డింగ్లండునకు విచ్చేసి ఎడ్వర్డునింట నతిథి యై కొన్ని దినము లుండి తిరిగి తస రాజ్యమునకుఁ జనెను.

ఎడ్వడు భార్యాసహితుఁ డై స్కాట్లండు ద్వీపమునకు వెళ్లెను. అచ్చట నాప్రజలు ఆరాజదంపతుల ననేక రీతుల సత్కరించి తమరాజుభ క్తిని దెలియఁ బరిచిరి, అతఁ డాచోటు వాసి జూలై నెలలో నైర్లండు లంకకుఁ జనెను. అతని వెంట నాత ని పత్నియును వెళ్లెను. అయిరిషు జనులా రాజదంపతులకు స్వాగతంబు నొసంగుట లేదని తిరుగఁబడినను, వారిలో రాజ భక్తి సంపన్ను లనేకులు వారియెడ ననురాగము కలవారే పెక్కు తెఱగుల వారిని గౌరవించిరి.. అయిరిషు జనులు క్రైస్త ప మతమున రోమను కాథలిక్కు మతస్థులు, వారికి రోముపురిలో నుండు గురువు మతాచార్యుడు. అతని పేరు పదుమూఁడవ పోపులి యో'. ఆమతాచార్యుఁ డప్పుడే సిద్ధి చెందెను. అయిరిష్ జనులు తమ మతాచార్యుడు స్వర్గస్థుడయ్యె సనికుందు చుం డిరి ఎడ్వర్ణట్టి వారిని అనునయించి, నాకోపాకాగ్నిఁ దన వాక్సు ధావర్షముచే నార్పి, మేనూత్ నగరంబునకు నేతెంచి, అయి రిష్, జనులలో మతగురువులు బాలురు విద్య నభ్యసించు నాలయ మును బరీక్షించి, ఆయిరీషు జనుల యుదార బుద్ధి సంపదలను మెచ్చుకొని, అయిర్లండులో బీదలు నివసించు పల్లెలకు వెళ్లి, అందలి రిక్త జనులం గాంచి పరిస్థితిని జూచి వారి కై దుఃఖంచి