పుట:Saptamaidvardu-Charitramu.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

సప్త మైడ్వర్డు చరిత్రము.


వారికిఁ గొంత ద్రవ్యసాహాయ్యము సేసి, అయిరిషుజనుల ప్రీతి వడసి తన రాజ్యమునకు వేంచేసెను.

ఎడ్ర్డ లెగ్జాండ్రులు “విక్టోరియా” అను కుమార్త వెంటఁ జనుదేర నైర్లండులంకకు వెళ్లి.. ఆదీవికి రాజధాని యైస డబ్లీ నను పురంబున నాతఁ డొక కళాశాలకు న స్తిభార మును వేసెను. కిల్కని, లీన్ మోరు, మున్నగు తావులలో నా రాజదంపతులకు సకల మర్యాదలు నడిచెను. వార లాతా వును వదలి తమదేశమునకు మరలిరి.

ఎడ్వర్డ నేక పర్యాయములు ఖండమందలి గొప్పగొప్ప పట్టణబులకు వెళ్లి ఆ రాజుల మైత్రిని అంది వచ్చుచుఁ బోవు చుండెడివాఁడు. కాని అతఁడు జర్మని దేశములో బెర్లినను సగ రంబునకుఁగాని అందలి మఱే పట్టణంబునకుఁగాని నెళ్లి యుండ లేదు. జర్మని రాజ్యమునకును, ఇంగ్లడుకును, గల రాజకీ యవ్యవహారములు శుభ సూచకము లైనవిగ గస్పట్ట లేదు. ఎడ్వర్డు జర్మని దేశములో నుండు కీలను తావునకుఁ జనెను. జర్మని రాజు ఆచోట నాయింగ్లండు నొడయని మిక్కిలి గార వించి ఆయన నభినందించెను. ఎడ్వర్డావల హాంబర్గునకు నే తెంచి, అందలి జను లొసంగు విందుఁ గుడిచి, కీలునకుఁ జను దెంచి, ప్రష్యారా కొమారు కొసంగిన నాతిద్యంబుఁ బొంది, రుష్యా దేశ చక్రవర్తి కుమార్త నామకరణ మహోత్సవమును గన నారాజ్యమునకు వెళ్లి, క్రమ్మఱ దన యిరవునకు నరుదెం