పుట:Saptamaidvardu-Charitramu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

సప్త మైడ్వర్డు చరిత్రము.

. రాగి (ఫ్రెంచిజనులు తమదొరలు తముఁ జక్కఁగఁ బాలించుట లే దని వారిమీఁద దాడి వెడలి వారిని రాజ్యచ్యుతులుగఁ జేసి, తా మే తమదేశమును బాలింపు గడంగిరి. వారండఱును ఏటటనో "రెండేండకు నొకతడవనో తమలో ఒక తెలివి కలమెలకను తమకుఁ బాలనలో సాయము సేయుటకు నీయ మించుకొను చుందురు. అతనికి "ప్రెసిడెంటు” అని పేరు. మనము వాని నే అధిపతి అని చెప్ప నొప్పును. ఇతఁడు. తన యావజ్జీవపర్యంతము రాజ్యము నేలఁడు. ఇతని వంతుకాలము ముగిసిన వెంటనే ఇతనిస్థానమునకు నికొకఁడు వచ్చును. ఇతని సంతతివారే రాజ్యమునకు రావలయు నని చట్టము లేదు. ఇతని చేఁ జేయఁబడు ప్రభుత్వము జనుల ప్ర భుత్వ ముని 'చెప్పుబడును. దాని నే ఆంగ్లేయ భాషలో రిపబ్లిక్ ( Republic ) అని చెప్ప దురు. "రాజు" అనునాత డు తనయావజ్జీవము రాజ్యము నేలును. ఇతని వెనుక ఇతనికి బట్టిన వారు రాజ్యమునకు వత్తురు, ఆదేశ ప్రభుత్వ మీతని దై యుండును, దీనికి ఏక రాజ్యా ధీపత్య మని పేరు.

జూలై నెలయందుఁ బారాశు దేశ ప్రజా ప్రభుత్వమునకు మేటి యైన లూ బెట్టు(Louhet)అను నాతఁడింగ్లండునకు నే తేం చెను. ఎడ్వర్డును, ఆతనిముత్రులను, ఆ ఫ్రెంచి దేశాదీశునకు సకలమర్యాదలు సల్పి, సెంజేంసుస్సు నగరంబున విందు లొనర్చిరి. ఇందువలన నాంగ్లేయులకును, ప్రెంచి వాకిని ని, కల మైత్రి వృద్ధి