పుట:Saptamaidvardu-Charitramu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

సప్త మైడ్వర్డు చరిత్రము.


నడువ వలసిన పట్టాభిషేకము ఆగస్టు నెలలో జరుగు నని ముత్రులు తెలియఁ జేసిరి.

ఎడ్వర్డు వ్యాధి క్రమముగఁ గుదుటఁ బడఁ జొచ్చెను. సర్ ఫ్రెడరిక్ ట్రీవ్సు(Sir Fredrick Treyes) అను వైద్యుఁడు ఆయనకుఁ జికిత్స సేయుచుండెను. ఆయువు బటువుగ నుండె నేని, ఏమం దైనను రోగమును కుదుర్చును. కొన్ని వేళలలో బీదల రోగములు మందులు లేక కుదిరి పోవు చుండును. ఎడ్వర్లు రాజాధిరాజు. అతనికి రోగము వచ్చినప్పుడు అనేకు లావ్యాధిని మాన్పుటకు వచ్చి రనుటలో నాశ్చర్య మేమి ? ఎడ్వర్డు వ్యాధి నెమ్మది పడెను. జూను నెలలోఁ బట్టా భి షేకము నడువక పోయినను, రాజ్యము సభివృద్ధిఁ దీసికొని రావలయు సని పాటుపడిన వారికి నాప్రభువు ప్రాలుమాలక బిరుదుల నం పించెను. సౌలి స్బెరీ ప్రభువు తన మంత్రి పదమునుండి తొలఁగి విశ్రాంతి జందెను. అతని పదమునకు బాల్ఫరు ప్రభువు వచ్చను.

ఎడ్వర్డు వ్యాధి బాగుగ నుపశమించెను. ఆగస్టు నెల 9 వ తేది శనివారమునాఁడు ఆతనిపట్టాభి సేకము వెస్టుమినిస్టరు భననంబున నడిచెను. పర రాజులును, సామంత ప్రభువులును, శ్రీమంతు లైన వర్తకులును లెక్కకు మిక్కిలి యై వచ్చిరి. పట్టాభి పేకపు సంబరములు గాంచి సంతృప్తులై ఆయనకుఁ గాను కలను సమర్పించి, ఆయనవలన మన్ననలువడసి, తమతమ దేశములకు "నేఁగిరి.. ఎడ్వర్డు తన పట్టాభి సేక మహోత్సవ