పుట:Saptamaidvardu-Charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

141


వేళ లండనువురిలో నుండు వై ద్యాలయమునకు ధర్మార్థము రూ 17, 25,000 లను ఇచ్చెను. అతఁ డోస్బో రనుభ వనమును తన జనుల యుపయోగార్థము విడిచెను. తదాదిగ నామందిరం బున రణశూరులు నివసించు చుందురు. ఎడ్వర్డు పట్టమును గట్టుకొని తనవశమునఁ దనతల్లి విడిచిన ప్రజలను స్కాకుటకుఁ బ్రారంభించెను.

పదియవ అధ్యాయము.

ఎడ్వర్డు ప్రభుత్వము

.

ఎడ్వర్లు ప్రభుత్వమునకు వచ్చినతోడ్తో బరరాజులతో మైత్రిని మెలఁగఁ గోరెను. అతఁ డందుల కై సదా అన్య దేశం బులయందుఁ గ్రుమ్మరు చుండువాడు.

1908 సం. న ఏప్రెలు నెల నాతఁడు పోర్చుగీసు రాజ్య మునకు రాజధాని యైన లిస్బను, జీబ్రాల్టరు, మాల్టా, 'నీపిల్సు, రోము, పారిసు, మొద లగుపుట భేదనంబులకు వెక్లెను. లిస్బను పురంబున నా రాజు ఎడ్వర్డు, న నేక భంగుల గౌరవించెను. రోము పురి వాసు లాయనకు సంప్రీతిని విందులు సల్పిరి, పారిస్ పురం బున్న ఫ్రెంచివారితో నాతఁడు నిండుమచ్చిక గొంత కాల ముండి రగులు విరోధాగ్ని నాగ్పి తన టెంకీకిఁ జ నెను.

ఫ్రాన్సు దేశమును ముందు రాజులు పాలించు చుండిరి.