పుట:Saptamaidvardu-Charitramu.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిద వ య ధ్యాయము,

139నన్ని విధముల నలంక రించికి. పరరాజ సమూహంబులకును, సామంత ప్రభు ప్రకరంబులకును, ఎడ్వర్డు పట్టాభి షేకమహోత్స వమును వీక్షించుటకు రావలయు నని కమ్మలు వోయెను. ప్రతి మనుష్యుడును, ఎడ్వర్డు పట్టాభి సేకవు సంబరమును గుఱించి యే వేళఁ బలుకుచుండెను.

దక్షిణాఫ్రికా ఖండంబున బోయరులతోడి, కలహవై శ్వానరుఁడు చల్లారెను. ఎడ్వర్డు చింత కొంతవఱకు నుపశమించె. జూను నెలలో బట్టాభి షేకము నడుచుటకుఁ బ్రయత్నములు అత్యుత్సాహమునఁ గొన సాగు చుండెను. ఆల్టెరుషా టను చోట నాంగ్లేయుల సేనాసమూహముల సొంపు నెడ్వెర్డు వీక్షింప బోవు నని తెలియఁ జేయఁ బడెను. కాని అతఁడు రోగపీడితుఁ డైనందున నచ్చోటి కిఁ బోలేఁ డయ్యె.

అతడట్లున్నను, భార్యాసహితుడై వింజరునకు నేతెంచి, ఆచోట రెండుమూఁడురోజు లుండి. లండను పురికి నే తెంచెను. ఆతని నాశ్రయించిన వ్యాధి యెంతమాత్రము తగ్గిన టులు గాన్పింప లేదు. అది రానురాను పెరుఁగుచునే ఉండెను. అయినను బట్టాభిషేకము గాంచుటకు నువ్విళ్లూరు చుండు జనుల యభిలాష, సిద్ధింప దేమో అని ఎడ్వర్డు చింతించు చుం డెను.. రానున్న రాక పోవు నా ? ప్రభవు లైనను తమకుఁ గలుగు నాపదలు రానీక తొలగింప జేసికొనక గలరా? ఇదేమిమాట! ఎడ్వర్డును రోగపీకతుఁ డైనందున జూను నెలలో