పుట:Saptamaidvardu-Charitramu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

నప్త మైడ్వర్డు చరిత్రము.


లయమును మేలైన స్థితికిఁ దెచ్చుటకు సర్వకాలంబుల నుద్య మించు చుండెను.

1897 సం. అక్టోబరు నెల 27 వ తేదీని ప్రిన్సుజార్జి అత్త గారును, టెక్కు రాజ్యము నేలిక సానియును, అయిన ముసలియి ల్లాలు కాలధర్మము నొందెను. దానివలన నారాజకుటంబమును కంతయు దుఃఖ మావహిల్లెను. కాని అది దీర్ఘ కాల ముండక కడువడిగ సమసి పోయెను.

ఎడ్వర్డు మోకాలు బెణుకుట

,

1898సం. స ఎడ్వర్డు ఫ్రాన్సు రాజ్యమున మధ్యధరా సముద్రతీరంబున నుండు కాన్సు (Cannes) అను పురంబునకు వెళ్లెను. అతడా నెల 10వ తారీఖున ఒక భననంబు నిర్మించుటకు న స్తిభారమును వేసి వారిచ్చిన నాతిథ్యంబు వడసి తన రాజ్యము నకు నేతెంచునపుడు బాటలో నుండు పారిసువీటఁ గొంత కాలము విశ్రమించి, అచ్చట ప్రజాపరిపాలనాధికారిని (President of the French Republic) దర్శించి తన వీటికిఁ బుత్తెంచెను.

ఫ్రాన్సు రాజ్యమునకు రాజధాని యైన పారిసునగరంబున నొక ప్రదర్శనము 1900సం. న జరుగునటుల నిశ్చయింపఁబడెను, ఇంగ్లండులోని వస్తుశాలా ప్రదర్శనమునఁ జక్కఁగఁ గనఁబఱప పలయు నని రాణిమంత్రు లాలోచించి “రాయల్ కమిషన్" అను ఒక సభను ఏర్పాటు చేసి దానికి ఎడ్వర్డును ఒడయనిగ నియమించిరి. ఎడ్వర్లు తన ధర్మమును న్యాయముగ నొనర్చి మంచి పేరు వడసెను.