పుట:Saptamaidvardu-Charitramu.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవయధ్యాయము

131


మే నెలలో గ్లాడ్ స్టనను దొడ్డమంత్రి పరలోకగతుఁ డయ్యె. రాణికిఁ గుడిభుజ మని చెప్పఁ దగునాతఁడు పోవుట ఆంగ్లేయుల రాజ్యమునకు గొప్ప నష్టమని వేఱుగఁ జెప్ప నక్క ఱలేదు. ఎడ్వర్డును ఆయన చావునకు మిగులఁ గుంది, అతని పెండ్లమును ఊఱడించెను.

జూలై నెల 18వ తేదీని ఎడ్వర్లు "వాడ్ న్ డెస్" అను చోట నుండు “ బారన్ ఫర్డినాండ్ డిరోత్ స్ చైల్డ్ " (Baron Ferdinand de Roths child) అను నాతనిఁ జూడ వెళ్లి మిద్దె క్రిందికి దిగునప్పుడు కాలు జారి పడెను. మోకాలిచిప్ప ఊడెను. నుండి అందుచే బైటికి రాక ఉండెను. అతడా నొప్పిని సహించు కొని నాటి మధ్యాహ్నంబున మారల్బరో భవనంబునకు నేతెం చెను, గాయము వలని బాధ రాను రాను వృద్ధియాయెను.అనేకు లెడ్వర్డు కుంటివాడగు నని భీతిల్లిరి. మఱికొండఱు కోయ్య నూతగాఁ గైకొని దాని సాయంబున నడుచునేమో కాని, ఇక నడువడని గొణుగు చుండిరి. దైవాజ్ఞ ఎటు లున్నదో ఎవ రెఱుంగుదురు.

లండను నగరంబున నుండు గొప్పగొప్ప శస్త్రవైద్యు లెల్లరును వచ్చిరి. వారి వలన నాగాయము కుదురునటులఁ గనఁ బడ లేదు. టెక్కు దొరసానికి ప్రాణమును పోనీక చాల కాలము వఱకు నాపిన సర్ థామస్ స్మిత్తు (Sir Thomas Smith) అను నతనిని రాణి మంత్రులు పిలిపించిరి. అతఁడు వచ్చి ఎడ్వర్డు