పుట:Saptamaidvardu-Charitramu.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవయధ్యాయము

129


వీక్షింప నేతెంచిన ప్రభు ప్రకరంబుల ననేక భంగులఁ దృప్తి పఱచి, వారిని వారివారి రాజ్యంబులకు బంపెను.

ఇంగ్లండు దీవినుండు “స్పిట్టు హెడ్డు" అను రేవుపట్టణం బున నాంగ్లేయుల యుద్ధ నావలు సముద్రంబునఁ గూడెను. అవి చూపరుల కనులపండువై యొప్పారు చుండెను. ఎడ్వర్డు రాణికి మాఱుగ నాతావుకు వెళ్లి, ఆయోడల యందలి సైనిక నికాయంబులు గాంచి మహాసంతోషముంబు నొందెను. అన్య దేశ రాజులును తమ తమ యుద్ధ నావలను ఇంగ్లండునకును తమకును గల మైత్రిని వృద్ధిపుచు నిమిత్తము పంపిరి. ఆంగ్లే యుల యుద్ధనావలం గాంచి పరరాజుల గుండెలు బ్రద్దలగు చుండెను.

విక్టోరియా డైమెండు:జూబ్లిను మహోత్సవ సమయంబున నారాణి అనేకులకుఁ బెక్కు బిరుదుల నొసంగెను. అప్పుడా రాణి వేల్సుయువరాజునకు " గ్రేట్ మాస్టర్ అండ్ప్రింసిపల్ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ మోస్ట్ ఆనర బిల్ ఆర్డర్ ఆఫ్ ది బాత్ ” ” { (Great Master and Principal Knight Grand Cross of the Most Honourable order of the Bath) అను బిరుదు నలంకరింపఁ జేసెను, లండను పురంబుననుకు “రాయల్ కాలేజి ఆఫ్ ఫిజీషన్స్" (Royal College of Physicians) అధికారులు అవైద్యాలయసభలో నొక సభ్యునిగ నాయెడ్వర్డును గైకొనిరి. అతఁడు తనకీపదవి అబ్బినందులకు మిక్కిలి సంతసించి, ఆవైద్యా