పుట:Saptamaidvardu-Charitramu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

సప్తమైడ్వెర్డు చరిత్రము


కమున నవయుచుఁ గాటికి గాలుచాచుకోని యుండెను. అతని మరణ మొక వేళ నామ ఘోత్సమునకు భంగము సేయునో అని రాణి ప్రభృతులు చింతిల్లు చుండిరి. వారు తలంచిన రీతి నా రాజ్య ప్రభువు స్వర్గస్థుఁ డయ్యె, ముహూర్తదినమున నందఱును శోక వేషము వేసికొనక వేడుకలు సల్పిరి. నాఁడు విక్టోరియా మహా రాణీయును మంత్రులును, రాజబంధువులును, “పెక్కు మంది సామంత రాజు ప్రకరంబులును, మారల్బరో భవనంబున నుండిన ఎడ్వర్ణ లెగ్జాండ్రాలను జూడ వెళ్లిరి. ఆయిర్వురును వచ్చిన వారిని మిగుల గౌరవించి, విక్టోరియా నాఁడు తనబిడ్డలతో విందు కుడిచెను.

పెక్కు మంది శ్రీమంతులును, సామంత ప్రభునిచయంబు లును, పర రాజనివహుబులును, ఎడ్వర్డ లెగ్జాండ్రులకు సజరులను దెచ్చి సమర్పించి.. ఎడ్వర్డు తనభార్యామణికి సవరత్న ములు పొదిగిన కంఠాభరణంబు లొసంగె. రుష్యారాజ్యపుఁ జక్రవర్తి యును, చక్రవక్తినియును, అలెగ్జాండ్రాకు నవరత్న ఖచితమైన కంఠాభరణంబును చదివించిరి.. అలెగ్జాం డ్రాయొక్క శిశువు లామెకుఁ దమకుఁ దోచినకానుకలను సమర్పించిరి. వీరుగాక ఎడ్వర్ణ లెగ్జాండ్రాలకు ననేకులు బహుమతులను బంపి తమతమ రాజభక్తిని వెల్లడి సేసిరి..

ఎడ్వర్డు ప్రభృతు లీవిధంబున నింగ్లండున వేడుకలు నేసి కొనుచు నత్యుల్లాసంబున నుండ నాజర్మనీ దేశపు ప్రభువు ఫ్రెడ