పుట:Saptamaidvardu-Charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవయద్యాయము.

103

యిపు పుర వాసుల పక్షమున నెడ్వర్డునకు స్వాగత మిచ్చి పలు విధంబుల గౌరవము సేసి, తమపురికి రమ్మని ఆయనను వేడిరి. అతడు వారి ఇష్ట ప్రకారమా పురంబున గవర్నరు నింట నతిది యై ఉండెను.

ఎడ్వర్డుబొ బాంబాయి పురమును జేరిన మూడవదినమున నాతని పుట్టిస దినమహోత్సవము సతివైభనమున సడిచెను. ఉత్తర హిందూ స్థానంబునను, దక్షిణ హిందూస్థానమునను, ఆయ సపుట్టిన రోజున జనులు పండుగలు చేసికొని ప్రమోదభరితులై ఉండిరి. ఆతడా దినమున రాజులకుఁ దగిన-చిహ్నము లన్నింటిని ధరించి తన్నుఁ జూడనచ్చిన మా దొడ్డవారిని గౌరవించు చుండెను, ఆతఁ డప్పుడు రజతమయ మైన యున్నత సింహాసనంబు పై అధిష్టించి యుండెను. అన్ని వేడుకలును అతి వైభనముతో నడిచెను.

స్వదేశ సంస్థానాధిపతు లనేకులు బొంబాయి పురంబుసకు "నేతెంచి ఎడ్వర్డును దర్శించి, తమతమ రాజ్యంబులకు రమ్మని వేడిరి. వారిలో గొలాపుర సంస్థానాధిపతి మిక్కిలి పసివాడు అతఁ ఉప్పుడు పండ్రెండేండ్ల వయస్సు కలహాఁ డై యుండి, ఎడ్వర్డును జూడఁబోయినపుడు, వినయ గాంభీర్యంబులు సూపె ను. ఎడ్వర్డా చిన్న రేని గాంచి హర్షంబు నొందెను. ఎడ్వర్లు బొంబాయి పట్టణంబున నావలఁ గొన్ని దినములు - మాత్ర ముండెను. తన్ను ముందుగఁ జూడవచ్చిన రాజుల