పుట:Saptamaidvardu-Charitramu.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

సప్తమైడ్వెర్డు చరిత్రము


హిందూ దేశము నేలు వైసురాయి నార్తు బ్రూకుకు ప్రభువు బొంబాయికి వెళ్లి :ఎడ్వర్ణునకు స్వాగతమిచ్చుటకు సిద్ధుడై యుండెను. బొంబాయి గవర్నరును, అతని పరి జన సమూహము లును, అయనను బరివేష్టించి ఎడ్వర్డు రాకకై ఎదురు సూచు చుండిరి.. బొంబాయి రాజ్యభాగములోని స్వదేశ రాజులు ఆ పురమునకు నేతెంచి ఎడ్వర్డును గాంచి ఆయనను తమదేశము లకుఁ బిలుచుకొని పోవుటకు సిద్ధులై యుండిరి. వేయేల? సర్వ జనులును బొంబాయి హార్బరుస ఎడ్వర్లును వీక్షింప గౌతూ హలులై కాచుకొని యుండిరి ...

ఎడ్వర్డు బొంబాయిని దిగుదినము ముందే తెలియఁ బరచి యుండెను. నాడు అతడు ఆచోట సడుగిడిన వెంటనే గొప్ప గొప్ప పట్టణములయందలి కోట బురుజులనుండి పిరంగి వేటు లాతని రాకను హిందూ దేశస్థులకు నేఱుక పరుప నేర్పాటు చేయబడియుండెను. నవంబరు నెలారంభమున నెడ్వెర్డు బొం బాయి హార్బరులో దిగెను.

ఎడ్వర్డు వచ్చిన యోడ బొంబాయి రేవు జేరెను. కోట బురుజులనుండి పిరంగులు "ఎడ్వర్డు వచ్చెను. ఎడ్వర్డు వచ్చెను. ” అని జనుల చెవులు తూట్లు పొడుచు చుండెనను రీతిని మ్రోగెను. నార్తు బ్రూకు ప్రభువు ఎడ్వర్డునకు నెదురేగి, ఆయనను బిలుచు కొని వచ్చి, ఆయనకై ఏర్పరిచిన యుంతాసనంబుస గూర్చుండ జేసెను. బొంబాయి మునిసిపాలిటి వారు బొంబా