పుట:Saptamaidvardu-Charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

సప్తమైడ్వెర్డు చరిత్రము


బసకు నాతడాదిసములలోఁ బోవుచుండెను. అప్పుడు అతను అయా రాజుల యాచార వ్యవహారములను అతి శీఘ్ర కాలములో గ్రహించెను. ఎడ్వర్డు ఆ రాజుల పూర్వీకులైన శూరులచరిత్రం బును, వారి పరాక్రమబులను, మిక్కిలి కొనియాడి వారిని సంతోష పరచెచెను. ఆ రోజులును ఎడ్వర్లు నడవడిక "మేలైననదని యును అందరకుఁ బ్రీతికర మైన దనియును తలంచి, ఆయనను మి గుల గారవించి. బొంబాయిలో నుండు నాంగ్లేయులు ఎడ్వర్డును దీసికొని వచ్చిన యోడలోని నావికులకు విందు చేసిరి. వారావిం దు గుడువ రమ్మని ఎడ్వర్డును వేఁడిరి. ఆతఁడును ఆచోటికి వెళ్లి సొమాన్యజనుని కైవడి వారితో పాటు భోజనము సేసి, వారిని దృప్తి పరచి తన బసకు వేంచేసెను. అప్పుడె ఎలిఫెంట్ స్టనుడాక్సు పూర్తియాయెను. ఎడ్వర్డు వాని దెరుచుటకు నియమితుఁడై ఉం డెను. హిందువులను, తురకలును, పారసీలును, ఆచోటికి వచ్చి యుండిరి, వారందఱును చేతులు కట్టి తమ మోదమును తెలుపు చుండ నాయింగ్లండు రాణీకుమారుఁడు డాక్సును తెంచి, తన బసకు వచ్చేసెను.

నవంబరు నెలనడుము నెడ్వర్డు పునహాపురికి జను దెంచి, బరోడాసంస్థానాధిపతి కొలువుకూటంబు విలోకించెను. ఎడ్వ ర్డు ఏనుఁగుపై నడనిలో వేఁటాడుటకు నిర్ణీతుడై యుండెను. ఏనుఁగు భాగుగ నలంకరింపబడెను. దాని మీద నంబారి నాలు గులక్షల పైకము వెలకలదై యుండె. ఎడ్వర్డు దానిమీద