పుట:Saptamaidvardu-Charitramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవయద్యాయము.

98


నిధిగ బోదలచి యున్నాడా? ఆయన యువరాజ్యపదవిని నా దేశమును గన జనుదేవ - నెంచియున్నాడా ?" అని ప్రశ్నచేసిరి. ఏ పెదాలో నాతడు వెళ్లినేమి ? ఇంగ్లడు నే లిక దేశ బిడ్డడు హిందూ దేశమునకు వచ్చుటచేఁ గొంత పైకము ఖర్చగుటచే నింగ్లీషు వారికి వచ్చిన నష్టమేమో? ఎడ్వర్డు ఆంగ్లేయులకుఁ బ్రభువైన హింరూ దేశస్థులకును ప్రభువేను. అట్టిఁ వాడా దేశమునకు బోవుటకై - ధనమేల వ్యయము సేయగూడదు? అతడాదేశమునకు వెళ్లుటలో మేలు కలుగునని తలచి రాణియు మంత్రులు, నెందరు ఎన్ని యడ్డమాటలు పల్కినను వానినన్ని టిని నిరాకరించి, ఆయనను బసుప నిశ్చయించుకోనిరి . యాంగ్లేయుల యచార వ్యవహారములకును, హిందూదేశస్థుల యాచార వ్యవహారములకును, గొప్ప భేషము కలదు, హిందూ దేశములోని స్వదేశ రాజు లాతనికి ననేక విధములగు కానుకలను సమప్పింతురు. అతడు వారికి బదులు బహుమతులొసుగ వలసి యుండెనెను. అతడందువలకై 6,00,060 రూపొయలు విలువగల వస్తువులను భద్రపరుచుకొనెను.

ఎడ్వర్లు హిందూ దేశములో నడుగిడినది మొదలు తిరిగి ఇంగ్లండునకు నేఁగువరకును అప్పుడు హిందూ దేశమునకు రాణి ప్రతినిధియైన నార్తు బ్రూకు ప్రభువునింట నాతఁ డతిథియైయుండ పలయును నని తీర్పు చేసిరి. ఇందులకు గాను 4,50,000 రూ.సొమ్ము వ్యయము సేయవలసి యుండెను. పోవుటకును, వచ్చుట