పుట:Saptamaidvardu-Charitramu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

సప్తమైడ్వెర్డు చరిత్రము

పతులను మిగుల గౌరవించెను. ఆవల వా రా తావును విడిచి తమ గృహంబు సేరిరి.


ఏడవ అధ్యాయము.


ఎడ్వర్డు హిందూదేశమునఁ గ్రుమ్మరుట.

ఆల్బర్టుప్రభువు జీవించి యుండినపుడు, కానింగుప్రభువు ఎడ్వర్డు హిందూదేశమును జూచుటకు నేగుటచే హిందూదేశస్థులకును, తమకును, గలమైత్రి పెరుఁగు నని ఒకానొకప్పు డాదొరతో మందలించెను. రాణి ఈ పలుకును విని మఱువక సమయము వచ్చినపుడు మంత్రులతో నీ విషయమై ఆలోచింపవలయునని తలంచెను. 1875-వ సంవత్సరమున నామె యొకనాఁడు మంత్రులతో నీ సంగతినిగుఱించి ఆలోచించెను. ప్రధానులును రాణీమాట లెస్స అని ఆమోదించిరి. అప్పుడు సాల్సిబరి ప్రభువు హిందూ దేశమునకుఁ గార్యదర్శిగ నుండెను. అతడు 1875-న సంవత్సరము అక్టోబరు నెల 11-వ తేదీన ఎడ్వర్డు హిందూదేశమును గనుటకు నేఁగును. అని ప్రత్రికలలోఁ బ్రకటింపచేసెను.

పార్లమెంటు సభాసభ్యులలో ననేకులు ధనమధికముగ ఖర్చుగు నను భీతిచే నా పయనము మాను కొనుట బాగనిరి. కొందఱు హైడ్ పార్కులో సభచేసి ఎడ్వర్డు హిందూదేశమునకుఁ బోఁగూడదని వాదించిరి, మఱికోందరు "ఎడ్వర్డు రాణిప్రతి