పుట:Saptamaidvardu-Charitramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

సప్తమైడ్వెర్డు చరిత్రము


కును దారి ఖర్చులు 7, 80,000 రూ., రొక్కము "కావలసి యుండెను. అతని సొంత ఖర్చులకు 9,00,000 రూ. ధనము కావలసి యుండెను. పార్ల మంటు: సభా సభ్యులలోఁ గొందఱు మాత్ర మింత ద్రవ్యము ఖర్చు సేయ నొల్లక పోయినను, డిస్రిలి ప్రభువు మొదలుగా గలవారు ఇంత పైకము ఎడ్వర్డు ప్రయాణముసకుఁ బట్టు ఖర్చులకుగా నియ్యవలసిన దని నిష్కర్ష చేసిరి.


హిందూ దేశములో నింతకుఁ బూర్వమున నుండిన సర్బార్టన్ ప్రీరు (Sir Bartle Frere) అను నాతఁడును, సదర్లెండు భూస్వామియును, ఎడ్వర్డు నెచ్చెలు జైన ఆయిలేస్ ఫోర్డు ప్రభువును (Lord Aylesford) "కారిన్ గ్టన్ దొరయును,(Lord Carrington)కర్నల్ ఓవన్ విల్లేయమ్సు (ColonelOven Willia119) మున్నగు వారాయస వెంటఁ జనుదేర నియు మితులై ఉండిరి. కాని అలెగ్జాం డ్రామాత్రము ఇంటిపట్టున నుండునటులు నిశ్చయింపఁబడెను. వీరుగాక ఇంక ననేకు లాతని సాహాయ్యము సేయ నియమితులై యుండిరి. వారిలో నొకఁడు వైద్యుడును, వేరొకడు హిందూదేశమున నెవరి కెవరికి ఏయే బహుమతు లియ్యనలయునో వారి వారికి నాయాబహుమతు లిచ్చుటకును, వారి వలనం దిరిగి "కానుకలను బొందుటకును, ఒండొకడు ఎడ్వర్డు గుఱ్ఱములు దామానులు మున్నగు వానిని సురక్షితముగఁ గాపాడి అతనికి సందఁ జేయుటకును, నిర్నీతులై యండిరి... వీరు పనివాండ్రలలో జేరిన వారు. రాజు బంధువులు