పుట:Saptamaidvardu-Charitramu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

97


1873.__1875.

ఎడ్వర్డు రెండేండ్లు ఇంట నెమ్మదిగా నుండుట.

1874 సం.. న జనవరి నెల రుష్యా దేశపు రాజవుత్రికయగు "గ్రాండు డచెను మేరియి" (Grand Duchess Marie of Russia) అను నామెకును, ఎడింబరో ప్రభువునకును, వివా హము నడిచెను. ఎడ్వర్డు లెగ్జాండ్రులు విక్టోరియా ప్రతినిధులు నుఁడి ఆపెండ్లిని జరిపిరి. డీనుస్టాన్లీ (Dean Stanley) అను నాతఁడు దేవాలయంబు. మంత్రములు పఠించెను. పరిణయము ముగిసిన వెంటనే వివాహమునకు వచ్చిన వారికి విందులు చేయఁబడెను. అప్పుడు వేల్సు యువ రాజును, ప్రష్యా రాజ్యము యొక్క రాజపుత్రుడును సహపంక్తిని విందు భుజించిరి . ఆవల నంద రును తమతమ బసలకు నేగిరి.

1874 సం. న మిడిల్ టెంపిలు హాలులో నెడ్వర్డు సకు విందు జరిగెను. న్యాయశాస్త్రము : నభ్యసించు వారాహాలులో నాశాస్త్రమును జదువుచుందురు. అతఁడు తన్ను గౌరవిం చిన వారి యెడఁ గూరిమి కలవాఁడై కొంత కాల మచ్చటి వారితో సరససల్లాపంబులు సేయుచుండి తనయింటికి వచ్చెను.

ఆసంవత్సరంబున నాతడును, ఆయన భార్యామణియును, ఒర్మింగుహాము జిల్లాకు వెళ్లిరి, ఆజిల్లా అధికారి జోసఫ్ చాంబర్లేనను నాతఁడు, (Mr. Joseph Chamberlain) ఈ రాజదం