పుట:Saptamaidvardu-Charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

సప్తమైడ్వెర్డు చరిత్రము


స్మరించు చుండెను. రాణీ మంత్రులు, లోకులకు నీశుభవార్తను తెలియఁ బఱచి. అందరును సంతోషాంబుధి మునిఁగిరి. క్రమముగ నెడ్వెర్డు ఆరోగ్యవంతుఁ డయ్యె.

ఎడ్వర్డు దేవుని దయవలన బ్రతికె నని తలచి రాణి భగవంతునకు మ్రొక్కు బడులు చెల్లింపవలయు నని మంత్రులతో మందలించెను. ప్రధాన పుంగపులు ఆదేవేరి మనోరథము పూర్తి కాగలందులకు నుద్యమములు సేసిరి. విక్టోరియాయును, ఎడ్వ డ్డలెగ్జాండ్రులును, శుచిగా నాల్గు గుర్రంబులు పూనిన శకటంబుల నారోహించి సెంటు పాలు గుడికిఁ జేరఁ దర్లిరి. పున ర్జన్మము నొందిన ఎడ్వర్డును జూచుటకు నీథులలో 'వేన వేలజనులు గుంపులుగూడి యుండిరి. అందఱును తిన్నగ నాదేవాలయము సేరిరి.

కోవెలలో నున్న తాసనంబున నిలిచి కాంటెర్బరి ఆర్చిబిషపు బైబిలులోని కొన్ని వాక్యములు చదివి "ఎడ్వర్డు దీర్ఘాయువు కలవాడై మనుచు జనులను బాలించుఁగాత! " అని కీర్తనము పాడెను. గుడిలో మొక్కుబడి చెల్లెను విక్టోరియామొదలగువారు వేరు తెరువుల నింటికి వచ్చిరి. ఒకానొక కవి,

" మృత్యువాతఁ బడియు మేన జీవముతోడ
జనులు మోద జలధి మునుఁగి వెలికి
వచ్చినాఁ డితుడు హెచ్చుగ నెడ్వర్డు
బ్రోవుమయ్య దేవ జీవ మిచ్చి.” అని కీర్తించెను.