పుట:Saptamaidvardu-Charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

95


ఎడ్వర్డు బ్రతుకుట దుర్లభ మనుమాట పుట్టెను. విక్టోరియా, ఆలెగ్జాండ్రా, మున్నగువారు మిన్ను విరిగి పైపైన బడ్డట్టుల నివ్వెర పడియుండిరి. వారికి దైర్యము వచ్చు మాటలుకూడ చెప్పనా రుండియును, అందఱును బ్రతుకడని నిశ్చియించుకొని యుండిరి. అ నేక రాజ్యముల యందలి జనులును, రాజులును, చక్ర వర్తులును, ఎడ్వర్డు దేహస్థితిని దెలియలియఁ జేయ వలయు నని రాణి మంత్రులకు జాబులు వ్రాయుచు....ఇంగ్లండున, నుండు జనులు సాండ్రింగు హాముభవనమునకు నేతెంచి, ఆయనను జూడ గుంపులు గూడియుండిరి.

ఇంగ్లండు, స్కాట్లుండు, అయిర్లండు..., కన్నడా, ఆస్ట్రేలియా, కేపు కాలని, హిందూ దేశము, మున్నగు రాజ్యములలో నుండు దేవాలయములలో సన్ని మతస్థులును, ఎడ్వర్డు జీవింప వలయు నని తమ తమ దేవతలకు మొక్కులు సలుప వలయు నని రాణి ప్రభృతులు అందఱకుఁ దంత్రీ వార్తను బంపిరి. అన్నిచోటులలో నాయా గుడుల యందు నన్ని మతస్థులు దేవతా ప్రార్థనలను గావించిరి. ఇందఱ మతస్థుల ప్రార్థనలు నిష్ఫలములగునే ? ఇందఱలో కొక్కఁ డైను సదాచార సంపన్నుడుండక ఉండునే.

ఎడ్వర్డునకు జ్వరము కొంచెము తగ్గెను. బాధ కొంత,వరకు నిలువసాగెను. అతనికి నిదుర పట్టెను. ఈసన్నలు శుభసూచకములైన వని అలెగ్జాండ్రా - తెలిసికొని , దేవుని సదా