పుట:Saptamaidvardu-Charitramu.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

సప్తమైడ్వెర్డు చరిత్రము


అరిస్సు వారిని జూడవచ్చి వారి దగ్గఱనే ఉండెను. వారందఱును మిక్కిలి సుఖంబుగా నుండిరి.

ఎడ్వర్లు నౌకరి యగు బెగ్గను వాడును, చెస్టరు ఫీల్డును జ్వర దేవతకు మంచి ఫలాహార మైరి. ఎడ్వర్డు మాత్రము దానికిలో బడని వాడయ్యును, దానిచే మిక్కిలి పీడింపబడుచుండెను, ఎడ్వర్డు మిక్కిలి. చేవకలవాఁ డగుటచే నాజ్వఱ మాతనిదొలుదొల్త బాధ పెట్టదయ్యే. అతఁడు క్రమముగ దానికి సధీనుడై లేవలేక పడకమీదనే ఉండెను. కొన్ని వేళలయందు నాతనికి మాటలు కూడ నిలిచి నిలిచి, తడఁబడుచు నోటనుండి మిక్కిలి కష్టమున వచ్చు చుండెను.

ఇట్టి జబ్బుస్థితిలో నాతనికి నలెగ్జాండ్రాయును, ఆయనతో బుట్టువు ప్రిన్సన్ అలిస్సును, దాపున నుండి ఉపచారములు సేయు చుండిరి. జెన్నరు, గల్, క్లేటన్, లోనగు వైద్య శిఖామణులు నిమిష నిమిషమునకు సర్వకాలంబుల నాయన సమీపంబునందుండి ముందు లిచ్చు చుండిరి. అలెగ్జాండ్రా ఎడ్వర్లు ప్రాణము నుండిన చాలు నని, " సర్వేశా ! మాభర్తను రక్షింపుము. మృత్యు దేవతకు నొసఁగకుఁడు. నా యైదువ తనము గాపాడుడుడు.” అని వేల్పును స్తుతించుచు ధైర్యలక్ష్మిని గోల్పోక ఆయన దగ్గఱనే ఉండెను.

విక్టోరియా ఎడ్వర్డు రోగ పీడితుఁడై ఉంఫుటను విన్నదై ఎకాయెకీని సాండ్రిం గుహాము భవనంబునకు సరుదెంచెను.