పుట:Saptamaidvardu-Charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

98

యము. సించుట లేదు. ఎడ్వర్డు మొదలుగా గలవారు క్రీమియాను బ్రవేశించి, అంచు రణము జరిగిన తావులను జూచిరి. రుష్యా దేశచక్రవర్తి ప్రతినిధి ఎడ్వర్ణ లెగ్జాడ్రాలకు సగౌరవంబుగా స్వా గతం బొసంగి, వారికి బహుభంగుల మర్యాదలు సలిపెను. ఆరాజదంపతులు క్రిమియాలో రణభూముల నన్నింటిని వేఱు వేఱుగ బరీక్షించి, ఉభయ సైనిక నికాయంబు లుండిన తోవులను గాంచి, యుద్ధ కాలంబున శిధిల మైన ఆల్మానది పై నుండు వంతెనను గని, క్రిమియా రాజ్యము నంతయు: గ్రుమ్మరి. రుష్యాదేశస్థులు ఎవరు వచ్చి నను రొట్టె ముక్కను, కొంచెముప్పును, ఇచ్చి ఆతిది పూజలు సలుపు చుండుదురు. వారు తుమవాడుకప్రకారము మన రాజుదంపతులకుఁ దమశక్తివంచన లేక ఆతిథి పూజులు సలీపిరి. ఎడ్వర్డలెగ్జాం డ్రాలు 14 వ తేదికి బాక్లావా యుద్ధ భూమిని గాంచి, లివిడియాలో నారాత్రి విశ్రమించి, మఱునాఁ డయంబున లేచి, కాల్యకరణీయుబులు దీర్చుకొని రష్యా దేశస్థుల సెలవు పొంది స్వదేశ గమునోన్ముఖులైరి.


ఎడ్వెర్డలెగ్జాండ్రాలు ఇంటికి మరలి వచ్చు. నపుడు ప్రెంచి దేశమునకుఁ జనుదెంచి, పారీస్ పురి పౌరులొసంగు నాతిథ్యంబు గొని, లండనుపురికి విచ్చేసిరి.

ఎడ్వర్డు రోగ పీడితుఁ డై ఆరోగ్యవంతుఁ డగుట

.

ఎడ్వెర్డలెగ్జాం డ్రాలు పలు దేశములు తిరిగి వచ్చిన పిమ్మట సాండ్రింగుహాము భవనంబున నుండీ , ఎడ్వర్డుతోబుట్టువు ప్రిన్సస్