Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = కాని మాంటువా (1798), మా రెంగో (1799), ఆస్టర్లిజ్ (1805) మొదలగు యుద్ధములలో ఓడి లొంబార్డి, బెల్జియములను గోల్పోయెను. 1808 లో నెపోలియను పవిత్రరోమక సామ్రాజ్యమును విచ్ఛిన్న మొనర్చెను. అందుచేత ఆస్ట్రియా - హా వ్యు బ ర్గుల కు హా ప్పు బర్గులకు "ఆస్ట్రియా చక్రవర్తి" యను బిరుదము మాత్రమే నిలిచినది. ఈ పరాజయముల వలన ఆస్ట్రియాలో జాతీయోద్రే కము హెచ్చిపోయెను. ఇదే సమయమున 'నెపోలియను రష్యాపై దండెత్తి అపార నష్టమునకు గురియయ్యెను. సమయము కని పెట్టి ఆస్ట్రియా, రష్యా, ప్రష్యా, ఇంగ్లం డులు కూటమిగా నేర్పడి, నెపోలియనుపై సైన్యము సైన్యమునకు ఆస్ట్రియా సేనాని స్క్వార్జన్ బెగ్గు నాయకుడై లీప్జిగ్ యుద్ధమున నెపోలియనును పూర్తిగా ఓడించెను. అచిరకాలముననే నెపోలియను ఖైదీగా పట్టుబడి ఎల్వాదీవికి పంపబడెను. నంపిరి. ఆ వియన్నా శాంతిసభ: యుద్ధానంతరము వియన్నాలో శాంతి సమావేశములు జరిగేను. ఇందు ఆస్ట్రియ యా ప్రధాని యగు మెటర్నిక్ ప్రధాన పాత్ర ధారియై ఆస్ట్రియా ఔన్నత్యమును పునరుద్ధరించెను. లొంబార్డ్, వెనిస్, ఇస్ట్రియా, డాల్మేషియాలు ఆస్ట్రియా కీయబడినవి. జర్మను సమాఖ్యపైనను, ఇటలీ పైనను ఆస్ట్రియాకు యాజమా న్యము లభించెను. తిరిగి మధ్యఐరోపాలో ఆస్ట్రియా ప్రముఖ రాజ్యమయ్యెను. 1815.48 విప్లవములు : మెటర్నిక్ నాయకత్వమున ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాలు పవిత్ర కూటమిగా నేర్పడి విప్లవశక్తులు నరికట్టు నిశ్చయించెను. ఆస్ట్రియా, నిరంకు శత్వమునకు పట్టుగొమ్మయై 1815-1848 ల మధ్య జర్మనీ, ఇటలీ, హంగేరీలలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య ఉద్య మముల నణచివేసెను. హంగేరీలో కోస్సూతు, గోర్గియను వారు స్వాతంత్ర్యోద్యమమును సాగించిరి. అది అణచి వేయ బడినది. చివరకు 1848 లో వియన్నా పౌరులు తిరుగుబా టొనరించి మెటర్నిక్్ను దేశమునుండి వెళ్ళగొట్టిరి. కాని స్క్వార్జెన్ బెర్గు ప్రధాన మంత్రియై ఆస్ట్రియాలో నిరంకు శత్వమును తిరిగి నెలకొల్పెను. సామ్రాజ్య విచ్ఛేదము : ఈ విప్లవపరంపరలతో ఆస్ట్రియా సామ్రాజ్యపు పునాదులు కదలినవి. ఇటాలి 47 ఆస్ట్రియా - (హంగేరి) యనులు, జర్మనులు, హంగేరియనులు, ఇతరజాతులు ఆస్ట్రియా ఆధిపత్యమునుండి విముక్తి పొంది స్వయం నిర్ణ యాధికారమును బడయ సంకల్పించిరి. ఇటలీ సమైక్యతకై పాటుబడుచున్న పార్టీనియా, ఫ్రాన్సులసహాయముతో 1858 లో ఆస్ట్రియాపై కయ్యమునకు కాలుదువ్వెను. యుద్ధమునం దాస్ట్రియా ఓడిపోయి విల్లా ఫ్రాంకా సంధి చేసికొని లొంబార్డీని సార్డీనియా కొసగెను. జర్మనీ నాయకత్వమును గురించి ప్రష్యా ఆస్ట్రియాలమధ్య చాల కాలమునుండి స్పర్ధ పెరుగుచుండెను. ప్రష్యా ప్రధాన మంత్రియైన బిస్మార్కు, ప్రష్యా నాయకత్వమున జర్మను జాతీయైక్యమును సాధింపనిర్ణయించెను. జర్మనీ ఉత్తరనీమ లందుగల ప్లెస్విగ్, హల్ ను అను రాష్ట్రముల విషయ మున తగవు పెట్టుకొని బిస్మార్కు ఆస్ట్రియాపై యుద్ధ మునకు దిగెము. ఆస్ట్రియా, సెడోవా యుద్ధమున పూర్తిగ నో డెను (1888), ప్రేగుసంధి ప్రకారము ఆస్ట్రియా జర్మనీ నుండి వైదొలగుటయేగాక 'వెనీషియా'ను ఇటలీకిచ్చి వేసెను. . బల ఆస్ట్రియా - హంగేరీ ద్వంద్వరాచరికము: ఆస్ట్రియా పరాజయములు హంగేరి జాతీయోద్యమమునకు మొసగినవి. ఆస్ట్రియా చక్రవర్తి జోసఫ్ దమన నీతివలన లాభములేదని గుర్తించి, హంగేరియనులతో 1887 లో రాజీ చేసికొనెను. ఈ రాజీవలన హంగేరి కించుమించు స్వతంత్ర ప్రతిపత్తి లభించెను. ఆస్ట్రియా- హంగేరి అను ద్వంద్వరాచరిక ము స్థాపింపబడెను. ఆస్ట్రియా హంగేరీలకు వేరువేరు శాసనసభలు, రాజ్యాంగము ఒసగబడెను. విదేశ వ్యవహారములు, యుద్ధవిషయములు, ఆర్థిక వ్యవహా రములు ముగ్గురు సభ్యులుగల ఉమ్మడి మంత్రివర్గమున కీయబడెను. ఈ మంత్రులు ఆస్ట్రియా - హంగేరీలచే సమ ముగా ఎన్నుకొనబడిన 120 ప్రతినిధుల సభకు బాధ్యులు. జోసఫ్ ఆస్ట్రియాలో చక్రవర్తియనియు, హంగేరీలో రాజనియు పిలువబడును. హంగేరియనులకు ఈ యొడం బడిక తృప్తి కలిగించినది. కాని ఆస్ట్రియా సామ్రాజ్యములో జెక్కులు, స్లావులు, రుమేనియనులు ఆందోళన మాన లేదు. ఆస్ట్రియా-జర్మనీ మైత్రి : క్రమముగా ఆస్ట్రియా, జర్మ నీలు తమ విరోధమును విస్మరించి మైత్రి వహింపసాగెను. బిస్మార్కు ప్రోద్బలముపై ఆస్ట్రియా త్రిసార్వభౌమ