ఆస్ట్రియా - (హంగేరి)
సంగ్రహ ఆంధ్ర
కూటమిలో చేరెను (1872). జర్మనీ, ఇటలీలు జాతీయైక్యతను సాధించుటచేత ఆస్ట్రియా పశ్చిమ రాజ్యములపై
ఆశ వదలుకొని తూర్పునందున్న బాల్కసు రాజ్యములపై దృష్టి మరలించెను. ఈ రాజ్యములు తురుష్కుల నిరంకు
శత్వమునుండి విముక్తి బడయుటకై ఉద్యమములను సాగించుచుండెను. రష్యాగూడ ఈ రాజ్యములపై కన్ను వైచెను. అందుచేత ఆస్ట్రియా రష్యాలకు బాల్కను రాజ్యములతో సంఘర్షణము ప్రారంభమైనది. ఇట్టి పరిస్థితులలో ఆస్ట్రియాకు జర్మనీసహాయ మత్యవసరమైనది. జర్మనీ కూడ ఆస్ట్రియా యెడల పక్షపాతము వహించి యుండెను. 1878 లో జరిగిన బెర్లిన్ మహాసభలో జర్మనీ ఆస్ట్రియా పదము వహించి బాస్నియా, హెర్జిగోవినా యను బాల్క నురాజ్యములను ఆస్ట్రియాకు సంక్రమింప జేసెను. ఈ సంఘటనముతో జర్మనీ, ఆస్ట్రియాలపై రష్యాకు పగ హెచ్చెను. అందుచే జర్మనీ, ఆస్ట్రియాలు
1879 లో ద్వివర్గ సంధిచేసికొని రష్యా యెత్తుల నెదుర్కొనుటకు సిద్ధపడెను.
1వ ప్రపంచ యుద్ధము : బాస్నియా హెర్జిగోవినాలను ఆస్ట్రియా ఆక్రమించుట సెర్వియా రాజ్యమున కిష్టము లేదు. అందుచే సెర్వియా ఆస్ట్రియా పై కత్తిగట్టెను. 1914 లో ఆస్ట్రియా యువరాజగు ఫెర్డినాండును సెర్వియనుల ప్రోత్సాహముతో బాస్నియా రాజధానియగు సారాజీహోలో హత్యగావించిరి. ఆస్ట్రియా సెర్వియాపై యుద్ధము ప్రకటించెను. సెర్వియాపక్షమున రష్యా, ఆస్ట్రియా పక్షమున జర్మనీ యుద్ధమునకు దిగెను. క్రమముగా రష్యా మిత్రులగు ఫ్రాంసు, ఇంగ్లండులు కూడ యుద్ధమున దిగుటతో ఇది మొదటి ప్రపంచ యుద్ధము (1914-18) గా పరిణమించెను. ఇందు ఇంగ్లండు, ఫ్రాంసు కూటమి మిత్రమండలియనియు, జర్మనీ, ఆస్ట్రియావర్గము మధ్య రాజ్యమండలి అనియు వ్యవహరింపబడెను.
ఆస్ట్రియా రిపబ్లిక్ : యుద్ధ కాలమున జెక్కులు, పోలులు, హంగేరియనులు ఆస్ట్రియాను ధిక్కరించి స్వతంత్రులైరి. మొదట గెలుపొందినను విట్టొరియో వెనిటోకడ ఓడిపోయి మిత్రమండలికి ఆస్ట్రియా దాసోహమనెను. మొదటి ఛార్లెను సింహాసన త్యాగమొనర్చెను. 12–11–1918 తేదీన ఆస్ట్రియాలో రిపబ్లిక్ స్థాపింపబడెను, ట్రియనాన్, సైంట్ జెర్మెయిన్ సంధుల ప్రకారము పోలెండు, జెకోస్లొవేకియా, హంగేరిల స్వాతంత్య్రమును ఆస్ట్రియా గుర్తించెను. ఆస్ట్రియాపై అనేక సైనిక నిర్బంధములు విధించబడెను. ఆస్ట్రియా రిపబ్లిక్ జర్మన్ రిపబ్లిక్ తో చేర నిర్ణయించెను గాని శాంతిమహాసభ సమ్మతింపలేదు.
యుద్ధానంతర ఆస్ట్రియా : హిట్లర్ ఆక్రమణము : యుద్ధానంతర పునర్నిర్మాణమందు ఆస్ట్రియాకు నానాజాతి సమితి అమూల్యమగు ఆర్థిక సహాయ మొనరించెను. దేశమున కమ్యూనిస్టులు, సోషలిస్టులు బలవడి ప్రచారము సాగించుచుండిరి. ఈలోగా జర్మనీలో హిట్లరు అధికారమునకు వచ్చెను. హిట్లరు జన్మభూమి ఆస్ట్రియా. ఆస్ట్రియాలో కూడ నాజీ పార్టీ స్థాపింపబడెను. నాజీ పార్టీకి (హింనీర్) ఆస్ట్రియా జర్మనీల సమైక్యత ప్రధానాశయము. ఆ ఆస్ట్రియా అధ్యక్షుడగు హెర్ డాల్ఫస్ ఆస్ట్రియా స్వాతంత్య్రమును రక్షించుట కనేక ప్రయత్నము లొనర్చెను. 1934 లో నాజీపక్షము తిరుగుబాటొనరించి డాల్ఫస్ ను హత్య గావించెను. హిట్లర్ ఆస్ట్రియా నాక్రమించుటకు యత్నించేను. కాని ఇటలీ నియంత ముస్సోలిని అడ్డుపడెను. చివరకు 1938 లో అబిసీనియా యుగమునందు ఇటలీ నిమగ్నమైయున్న సమయమున హిట్లర్ ఆస్ట్రియా నాక్రమించెను. 1940 లో ఆస్ట్రియా జర్మను రిహ్ (Reich సామ్రాజ్యము) లో లీనమైనది.
నేటి చరిత్ర : 1939లో హిట్లర్ దురాశఫలితముగ రెండవ ప్రపంచయుద్ధము ప్రారంభమైనది. మిత్రమండలి- రష్యా, ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సులు - హిట్లరు దురాక్రమణకు గురియైన రాజ్యములకు స్వాతంత్య్ర మొసగుటయే ఆదర్శముగ యుద్ధ మొనరించెను. 1943లో స్వతంత్ర ఆస్ట్రియా రాజ్యమును స్థాపించుటకు నిర్ణయము జరిగెను. 1945 లో రష్యా అమెరికా సైన్యములు ఆస్ట్రియా నాక్రమించినవి. కారల్ రెన్నరు నాయకత్వమున నొక తాత్కాలిక ప్రభుత్వము ను రష్యా ఏర్పరచెను. పశ్చిమ రాజ్యములు ఆ ప్రభుత్వముమ గుర్తింపలేదు. ఆస్ట్రియాను 5 భాగములుగా విభజించి మిత్రమండలి సైన్యము లాక్రమించెను (1) వోరాల్ బెర్గు, టైరోలు - ఫ్రెంచిభాగము ; (2) సాల్ట్ బర్గు, ఎగువ