విజ్ఞానకోశము .. వేదాంతశాస్త్రమువలన తెలియగలవు. పూర్వమీమాంసలో ఆత్మజ్ఞానము, లేక జీవమోక్ష విచారము అనవసరము అనియు "ఆత్మా జ్ఞాతవ్య ఇత్యేతత్ మోడార్థన చోదితం ! కర్మ ప్రవృత్తి హేతుత్వ మాత్మజ్ఞానస్య లక్ష్యతే" అనియు స్పష్టముగ తెలుపబడియున్నది. స్వమత స్థాపన కొరకు పరమత నిరాకరణము ఆవశ్యకము. పరమత కరణార్థమై పరమతములోని దోషముల యొక్కయు, హేశ్వాభాసముల యొక్కయు జ్ఞానము ముఖ్యము. ఇట్టి జ్ఞానము, పరమతము చక్కగ అభ్యసింపనిచో, లభించ జాలదు అను దృష్టితో తాను పరమత రహస్యములను అధ్యయన మొనర్చి, అధ్యాపకమతోన్మూలన మొనర్చి యుండుట ద్రోహరూపమైన మహాపాతకమని కుమారీలుడు గ్రహించెను. వేదముల అపౌరుషీ యత్వమును స్థాపించుటకై బ్రహ్మవిచారముచేయకుండుటచే తనకు నాస్తిక తానిరూపణ రూపదోషము గూడ సంక్రమించెనని తెలిసికొనెను. తెలిసి కొని ఇట్టి దోషద్వయము పూర్తిగా నశించుటకై ప్రాయ శ్చిత్తముగా తుషాగ్ని ప్రవేశ మొనర్చి అనువులబాసిన మహాత్యాగి కుమారిలుడు అని శంకర విజయమువలన తెలియుచున్నది. "స ఏష యజ్ఞాయుధీ యజమానోక అంజసా స్వర్గ లోకం యాతి" అను వాక్యము యొక్క తాత్పర్యము, "ఈ పురుషుడు యజ్ఞమను ఆయుధము ధరించి నిశ్చయ ముగా స్వర్గమునకు పోగలడు" అనునది. యజ్ఞాయుధీ అనగా యజ్ఞ పాత్రధారియగు యజమానుని శరీరము. ఆశరీరము నశించి దగ్ధమయిన తరువాత యజమానుడు స్వర్గమునకు ఎటులు పోగలడు? అను ఆక్షేపణ మొకటి కలదు. దీనికి ఉత్తరమిది : ఆత్మవిభుడు నిత్యుడు. ఇట్టి ఆత్మ శరీరము నాశ్రయించి యజ్ఞాయుధి అనబడుచున్నాడు. ఈఆత్మ శరీర, ఇంద్రియాదులకం టెవ్యతిరిక్తుడును యావత్ జ్ఞానమునకు మూలభూతమయిన "అహం" బుద్ధికి ఆశ్రయు డును, విషయజ్ఞానశక్తి స్వభావుడును, మానస ప్రత్యక్ష గమ్యుడును ఐయున్నాడు అని కుమారిలుడు విశదముగ చెప్పియున్నాడు. ఈ విషయమును ప్రతిపాదించు శ్లోక వార్తికము బహు గంభీరమైనది. దీనిచే జీవాత్మ యొక్క సత్త(వేదాంతశాస్త్రమువలెనే ప్రతిపాదింపబడు చున్నది. . 751 కుమ్మరము జ్ఞానము ఆత్మయొక్క గుణము. ఆత్మ ప్రతి శరీర ములో భిన్నమైయున్నది. ఏ జ్ఞానమందయినను జ్ఞాత, జ్ఞానము, శ్రేయము అను మూడు అంశము లుండును. ఆత్మకూడ ఇట్టి జ్ఞానకారణమయిన ప్రామాణ్యమునకు విషయమై యుండును; మానస ప్రత్యక్షమునకు విషయమై ఉండదు అను ఈ మతమును ప్రకరణ పంచికలో ప్రభా కరుని ప్రత్యక్ష శిష్యుడైన శావికనాథ మిశ్రుడు చక్కగ విశదీకరించి యున్నాడు. ఏమయినను చార్వాక, బౌద్ధా దుల మతములవలె, మీమాంస నాస్తిక వాదము కాదని చెప్పవచ్చును. కర్మయొక్క ప్రాధాన్యమును ప్రతిపా దించునపుడును, మంత్రబ్రాహ్మణ వాక్యముల యొక్క ప్రామాణ్యసాహాయ్యమున విధినిషేధార్థ వాదముల విచా రమును చేయునపుడును, ఉపనిషత్ ప్రతిపాద్య సచ్చిదా నందస్వరూప బ్రహ్మవిచారము అనవసరమని ఉపేక్షించి సంత మాత్రమున పూర్వ మీమాంస నాస్తిక వాదమని భావింపకూడదు, కుమ్మరము :
గుం. హ. ఎంత ప్రాథమికావస్థయందున్న మానవునకై నను ఏదో యొక రకపు పాత్ర అవసరమగుచున్నవి. ఈ పాత్రలు వెదురు, పేము మున్నగు వాటితోడను, చర్మముతోడను, గుమ్మడి, సొరకాయలు మున్నగు సహజ వస్తువులతోడను నిర్మింపబడుచున్నవి. కానీ వీటి యన్నిటికంటే మృణ్మయ పాత్రలు మానవునకు అధికముగ ప్రయోజనకారులుగ సున్నవి. ఏలయన, వీటికి అగ్ని సోకినను నశింపవు. అందుచే వంట పాత్రలుగా నివి మిగుల విలువ గలవి, మృణ్మయ పాత్రలు అయిదు దశలలో నిర్మాణమగు చున్నవి. మొదటి దశలో ఈ పాత్రల శరీర నిర్మాణము నకు అనువగు మట్టిని భూమినుండి త్రవ్వి తీయుదురు. ఈ మట్టిని పాకము వచ్చునట్లు చక్కగా పదునుచేసి, దీనిలో మృదువుగా నుండని ఇసుక నుగాని లేక బొగ్గు మనినిగాని మేళవింతురు. లేదా, గోమయమునుగాని, కాకున్నచో చిన్న ముక్కలుగా నరికిన గడ్డినిగాని కలుపు దురు. రెండవ దశలో పాత్రకు ఆకార మొసగబడును. తొలుత చేతితో కొన్ని సులభమైన ఉపకరణముల సాయ ముతో పాత్రలకు కుమ్మరి ఆకారము కల్పించెడివాడు.