Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుమారిలభట్టు దమయంతీ స్వయంవర సందర్భమున ఈరీతిగా స్పష్టముగా చెప్పియున్నాడు : g P “వేదై ర్వచోభిరభిలై ః కృతకీర్తి రత్నే హేతుం వినైవ ధృతనిత్య పరార్థయత్నే మీమాంసయేవ భగవత్యమృతాంశుమౌళా తస్మిన్మహీభుజి తయానుమతింన భేజే.” నై - సర్గ. 11.6 తా. సమస్త వేదములందలి మహా వాక్యములచే ప్రతిపాదింపబడినట్టియు, నిర్హేతుకముగనే పరమకారుణికు డైనట్టియు చంద్రావతంసుడునగు ఈశ్వరుని పూర్వ మీమాంసాశాస్త్ర మేరీతిగా నంగీకరింపలేదో ఆట్లే ఆరాజును (కుళద్వీపాధిపతిని) దమయంతి సమ్మతింపకపోయెను. ఇట్టి దుర్వాది మతములను ఖండించి నిజమయిన భాష్యార్థమును తెలుపుట కొరకే కుమారిలుడు, “ప్రాయేణైవహి మీమాంసా లోకే లోకాయతీకృతా తామా స్తికపథేకర్తుమయం యత్నః కృతోమయా” అని ప్రతిజ్ఞ చేసి విస్తృతమయిన శ్లోక వార్తికమును రచించి, పూర్వ మీమాంసామతము చార్వాకమతమువలె నా స్త్రీక మతము కాదని ప్రతిపాదించెను. కాని ఇతడు బ్రహ్మము జగత్కారణమని ఎక్కడను తెలుపలేదు. కనుక పూర్వ మీమాంసాశాస్త్రము నా స్త్రీకశాస్త్రము అను ఇతర శాస్త్ర నా కారుల ఆక్షేపణము ఆపాతతః చక్కగానే కన్పించును గాని, వస్తుస్థితి దీనికంటె భిన్నముగా నేయున్నది. ఎందు చేతనన కుమారిలుడు తన శ్లోక వార్తికములో, "విశుద్ధ జ్ఞాన దేహాయ, త్రివేదీ దివ్య చతుషే శ్రేయః ప్రా ప్తినిమిత్తాయ నమః సోమార్ధ ధారిణే". అను శివపరమయిన మంగళ శ్లోకములో ఆ స్తికతను స్పష్ట ఇదిగాక I-1-6- అధిక రణాంత మునందలి వరచెను. (i) అవి నాళీ స్వరూ వేణ, పురుపోయారు నా శీతాం ! మాత్రాణాం సాధికారాణాం, భూతాదీనా మసంజ్ఞ తా|| (ii) ఆత్యాహానా స్తిక్య నిరాకరిష్ణుః ఆత్మా స్తితాం భాష్యకృదత్ర యుక్త్యా ॥ దృఢత్వమేత ద్విషయ ప్రబోధః ప్రయాతివేదాంత నిషేవణేన || అను శ్లోకములచే ఆ స్తికతయే విశదీకరింపబడినది. _1148 సంగ్రహ ఆంధ్ర దీనిని మించిన ఆ స్తిక్యవాదము మరియొకటి కావల యునా? ఇదిగాక, దేవతాధికరణములో నవమాధ్యా యము నందలి ప్రథమ పాదములో నాలుగవ అధికరణ మునగల "దేవతావాప్రయుక్తత్వాత్" అను సూత్ర విషయము పరిశీలనార్హము. వేదోక్త ప్రకారముగ చేయు యజ్ఞము దేవతారాధనము కాదని సిద్ధాంతము. అగ్నీం 750 దేవతలు 'వై దిక మంత్ర ప్రతిపాద్యమయిన స్వర్గాది ఫలముల నొసగగలరు. గాన వారిని సంతోష పెట్టుటకొరకు యజ్ఞాదులు చేయబడును అను తత్త్వము మీమాంసా శాస్త్ర సమ్మతమైనదికాదు. దేవతలు ఫలమును ఇయ్య జాలరు. "యాగస్య ద్వే రూ వే-ద్రవ్యం దేవతాచ" అను వాక్యము యజ్ఞమునకే (చేయబడు కర్మణే) ప్రాధాన్య మిచ్చుచున్నది. ద్రవ్యము, దేవత. ఈ రెండును గూడ ఆయా గాంగములే. "అగ్న యేస్వాహా” అను మంత్రముతో అగ్ని దేవత కోరకు ఆజ్యాహుతి అర్పింపబడును. ఆ ఆహుతి అర్పించు కర్మ ముఖ్యమైనది. అది సక్రమముగ చేసిన యెడల అపూర్వ ముత్పన్నమగును. దానివలన స్వర్గాది ఫలము గలుగును. అర్పింపబడు ఆజ్యమెంతో అగ్నిగూడ అంతే. దేవత తృప్తిచెంది ప్రసాదమిచ్చు నను అ సేవలేదు. యాగ జన్యమయిన అపూర్వమే ఫలమియ్యగలదు. దేవత గౌణము; ఫలము ప్రధానము. "భూత భవ్యసముచ్చారణే భూతం భవ్యాయోపదిశ్యతే" అనునది భాష్యకార సిద్ధాంతము. భవ్యమనగా, చేయబడు క్రియ అనగా యాగము. భూతమనగా, సిద్ధవస్తువు - అనగా అజ్యము, పాలు, పెరుగు మున్నగు ద్రవ్యములు. అగ్ని, ఇంద్రుడు అను దేవతలనుగూర్చి "యజేత"యాగము చేయవలయును అను సాధ్యముతో ద్రవ్యమును దేవతలను కలిపి చెప్పుటచే సిద్ధము కూడ సాధ్యము కాగలదని దీని తాత్పర్యము, దీనివలన దేవతా ప్రాధాన్యము తగ్గి అపూర్వజనకమైన యాగకర్మకే ప్రాధాన్యము కలుగుచున్నది. దీనివలన యజ్ఞయాగాదులు దేవతారాధనములు కావు. యాగ సాధన ద్వారమున ఫలప్రాప్తికి ఉపయోగపడినంత మాత్రముననే దేవతలకు ప్రాధాన్యము కలుగజాలదు. దేవతల శక్తికంటే మనుష్యుని జీవాత్మ యొక్క శక్తియే గొప్పది. మమష్యుడు కర్తవ్య పరాఙ్ముఖుడు కాగూడదు అనునది బోధ. జీవుని స్వరూప స్వభావములు