విజ్ఞానకోశము -- మైన అర్థమును విని అతిశయముగా సంతోషించి తన శిష్యుడయిన ప్రభాకరునకు "గురు" అని బిరుదమునొసగెను. అప్పటినుండి ఇతడు ప్రభాకర గురువని ప్రసిద్ధి చెండెను. ప్రభాకరుడు శాబర భాష్యము మీద "లఘ్వ" (చిన్నది), "బృహతీ" (గొప్పది) అను రెండు వ్యాఖ్యానములు వ్రాసెను. ఇతడు భాష్యకార మతమును యుక్తి ప్రయుక్తు లతో సమర్థించి దానికి బహు సుందరమయిన వ్యాఖ్యలు వ్రాసి గూఢార్థములను వివరించెను. కుమారిలుడు సమ యానుసారముగా భాష్యకార మతమును ఖండించి క్రొత్త విషయములను కనిపెట్టి వివరించెను. ఈ కారణములవలన కుమారిల ప్రభాకరుల మతములు పరస్పర విరుద్ధములై యున్నవి. కుమారిలుడు ప్రభాకర మతమును ఖండించి నాడు గానీ ప్రభాకరు డెక్కడను కుమారిల మతమును ఖండించి యుండలేదు. ప్రభాకరుడు తన సిద్ధాంతములను సులభమైన శైలిలో స్థాపించినాడు. కారణములు బహు తేలికగా, స్పష్టముగా తెలియునట్టి విధముగ చూపినాడు. కుమారిలుని శైలి క్లిష్టమైనది. ఇతని ప్రతిపాదన ప్రకారము గంభీరము దుర్బోధము. ప్రభాకర కుమారిల మతములు భిన్నములు. వీరిద్దరును గొప్పవారే. వైదిక వాక్యవిచా రమునందే కాక, లౌకిక వాక్యవిచారమునందు కూడా వీరిద్దరి సిద్ధాంతములును ఉపయోగపడగలవు. కుమారిలుని మరియొక శిష్యుడుగా ప్రసిద్ధి చెందిన వాడు మండన మిశ్రుడు. ఈయనతోనే శంకరాచార్యులు వాదము చేసినారు. కుమారిలుని మూడవ శిష్యుడు ఉం వేకుడు. కుమారీలుని పుత్రుడు జయమిశ్రుడు. ఇత డును, ఉంవేకుడును కలసి శ్లోక వార్తికమునకు వ్యాఖ్యా నము వ్రాసినారని ప్రసిద్ధి. తరువాత గొప్పగొప్ప మీమాంసకు అందరు, కాట్ట (కుమారిల) మతము ననుస రించియే గ్రంథములు వ్రాసినారు. "వ్యవహారే భట్ట నయ్య" అని వాడుక' కలదు. శాస్త్ర వాదములలో, వ్యవహారములలో అనగా న్యాయశాస్త్ర (Law) వివా దములలో, అన్ని విషయములలో, భాట్టమతమే ప్రమా ణముగా వాడుకలోనున్నది. ఖాట్టమతము ప్రచారము చేసిన మహాపండితులు : 1. వాచస్పతి మిశ్రుడు (8.9 వ 'శతాబ్ది); 2. పార్థసారథి మిశ్రుడు (1050); 8. భట్ట సోమేశ్వరుడు (రాణక వ్యాఖ్యాకర్త 1200); 4. మాధవా 749 కుమారిలభట్టు చార్యుడు (1270-1860); E. వేదాంత దేశికుడు (1270); 6. అప్పయ్య దీక్షితులు (1520); 7, విజయేంద్ర తీర్థుడు (1540); 8. ఆపిదేవుడు (1580): 9. ఖండ దేవుడు (1590); 10. రాఘవేంద్ర తీర్థులు (1800); 11. నాగభట్టు (1850); 12. భాస్కరరాయడు (1700). ఈ ప్రకారముగ పూర్వ మీమాంసా శాస్త్రమనగా కుమారీల మతమే యని ప్రసిద్ధ మయినది. మిక్కిలి అభివృద్ధిచెంది బౌద్ధ జై నాది మతములు వ్యాపించియుండగా, తదవలంబమున సులభముగ నిర్వాణ ప్రాప్తి కలుగునని జనులకు సాధారణముగ నమ్మకము కలిగి యున్నపుడు, అతి శరీర క్లేశముతో, బహు ద్రవ్య వ్యయముతో కూడిన వైదిక యజ్ఞాచరణమునందు జను లకు ప్రవృత్తిని కలుగజేయుట చిన్న పనికాదు. వృత్తి కారుడయిన భవదాసు, భాష్యకారుడయిన శబరస్వామి, మహా పండితుడగు భర్తృమిత్రుడు మొదలయినవారు సాధింపజాలని మహాకార్యమును కుమారిలుడే చేయ గలిగెను. ఇతడు భాష్యములో లేని పెక్కు విషయము లను ఉపయుక్తములై యుక్తియుక్తములయిన సిద్ధాం తములను స్వయముగా కల్పించి, శాస్త్రమందున్న న్యూన తను తొలగించి, పరమతములను పూర్తిగ నిరసించి. వైదిక ధర్మమును స్థాపించెను. తంత్రవార్తికములో ఎన్ని యో క్రొత్త విషయములు భాష్యములో లేనివి వర్ణ కాంతర మనిచేర్చి, శాస్త్రమును సర్వాంగ పూర్ణము చేసి నాడు. పూర్వమీమాంసా శాస్త్రమునందు యజ్ఞ యాగాది కర్మానుష్ఠానమే ధర్మమని ప్రతిపాదింపబడుటవలన, జగ త్కారణమైన బ్రహ్మము యొక్క స్వరూపజ్ఞాన విషయక మైన చర్చ ఎక్కువగా ఇందు కన్పింపదు. కనుక ఇది నాస్తిక వాదమని పూర్వకాలమునుండి ఒక ప్రతీతిక లేదు. ప్రభాకరుడు, జగజ్జన్మాది కారణమును, సచ్చిదానంద స్వరూపమును అగు పరబ్రహ్మము యొక్క అస్తిత్వమును అంగీకరింపలేదు. కుమారిలభట్టు కూడ బ్రహ్మాస్తిత్వమును ప్రతిపాదింపలేదు. ఈరీతిగ మీమాంసా శాస్త్రము బ్రహ్మా స్తిత్వమును ఒప్పు లేదుకనుక, దానిని నాస్తికశాస్త్రమని తర్క వేదాంతాది శాస్త్రకారులు చెప్పుచున్నారు. ఇంతే గాక శ్రీహర్ష మహాకవి తన నైషధీయ చరితములో
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/802
Appearance