Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుమారిలభట్టు వివా కుమారిలుని బాల్యావస్థ, గురుకుల వాసము, హము, గృహస్థాశ్రమము మొదలయిన విషయములు తెలియవు. ఆ కాలమందు అనేక రాజాధిరాజుల యొక్క ఆశ్రయము కారణముగా అనేక దేశములందు అత్యంత వ్యాప్తి నొందిన బౌద్ధమతము యొక్క ప్రచారమును గావించుచున్న మహాపండితులతో అసహాయుడై వాదము చేసి జయమునొందుట తనకు శక్యము గాదని యోచించి కుమారిలుడు ఒక అపూర్వమైనయు క్తిని వన్నెను. వైదిక మతమునందు ఏమాత్రము స్వారస్యము లేనికారణముచే తాను వైదికమతమును విడిచి పెట్టితినని జనులకు వ్యక్త పరచి, తాను ఒక గొప్ప బౌద్ధ భిక్షుసన్నిధికి జేరి “బుద్దం శరణం గచ్ఛామి" అను శరణాగత మంత్రము పఠించి, బౌద్ధమత సిద్ధాంతములను అధ్యయనము చేసెను. ఈ ప్రకారము స్వమత పరిత్యాగ పూర్వకమైన సౌగత మత స్వీకారమును నటించి, జ శాస్త్ర రహస్యములు, యావన్ని గ్రహస్థానములు చక్కగ నెరిగి తిరిగి వైదిక మతమే తనదని ప్రకటించి, గొప్ప సభలలో మహాపండితు లతో వాదములు చేసి, వారి నోడించి, అప్రతిహత మైన వైదిక సామ్రాజ్యమును స్థాపించి జనులకు వైదిక దీక్ష లిచ్చి ప్రతి ఇంటిలో తేక (దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అను మూడు శ్రేతాగ్నుల సముదా యము) ను ప్రజ్వలింపజేసెను కుమారిలుడు. కుమారిలభట్టు, పూర్వమీమాంసా శాస్త్రమునందు ప్రత్యేకాభిమానము కలవాడు. కుమారిలుని ఇతిహాస మే పూర్వమీమాంసాశాస్త్రము యొక్క ఇతిహాసమని చెప్ప వచ్చును. కుమారీలునకును పూర్వమీమాంసకును ఈ రీతిగ అవినాభావసంబంధ మేర్పడెను. మీమాంసా శా స్త్రీతి హాసము మూడు ప్రకరణములుగా విభజింపబడియున్నది. 1. కుమారిల పూర్వయుగము, 2. కుమారిలయుగము, 8. కుమారి లో త్తరయుగము. విచారణచేయుట అను అర్థముగల 'మాన్' ధాతువు వలన 'మాన్ బధదాన్ శాన్ భ్యో దీర్ఘ శ్చాఖ్యాసస్య' అను పాణిని (అష్టాధ్యాయము III-1-2) సూత్రము వలస సన్నంతమయిన మీమాంసా శబ్దము నిష్పన్నమగుచున్నది. మీమాంస అనగా విచారము. ఈ శబ్దము బహు ప్రాచీన కాలమునుండి- అనగా వైదిక కాలమునుండి.. వాడుకలో. సంగ్రహ ఆంధ్ర నున్నది. "శత్ సృజ్యాంనో త్సృజ్యామితి మీమాంసంతే" (కృష్ణయజుర్వేదము _ VII.5.7.1) "వేదో జె.ఖలో ధర్మ మూల” మను ప్రమాణరీత్యా ధర్మమునకు మూలమయిన వేద వాక్యము యొక్క అర్ధవిచారమే మీమాంసా శాస్త్ర మునకు ముఖ్యవిషయము. వేదవాక్యమునకు అర్థనిర్ణ యము చేయునపుడు, ఉపక్రమాది తాత్పర్యలింగ విచా రము, కృత్యాది ప్రాబల్య దౌర్బల్య విచారము అర్హం తావశ్యకములు. ఇట్టి ఆశయసిద్ధిని పూర్వమీనూ? మే కల్పించుచున్నది. 748 మీమాంసా శాస్త్రమునకు సూత్రకారుడు జైమిని మహర్షి. ఈ సూత్రగ్రంథము నందు 12 అధ్యాయము లున్నవి. ఈ సూత్రములపై ప్రథమములో ఉపవర్షుడు వృత్తి వ్రాసెను. ఈ వృత్తిపై వెలసిన భాష్యములలో శబరస్వామి భావ్యమే ఇపుడు ఉపలబ్ధమై యున్నది. కుమారిలుడు ఈశబరభాష్యముపై వార్తికము వ్రాసెను. ఇందలి ప్రథమాధ్యాయస్థమయిన ప్రథమ పాదమునకు తర్క పాదమని పేరు. ఈ తర్క పాదముపై కుమారిలుడు కవార్తికము రచించెను. ప్రథమాధ్యాయ మందలి ద్వితీయ పొదము మొదలుకొని తృతీయాధ్యాయము నందలి నాలుగు పాదములవరకు వ్రాయబడిన వ్యాఖ్యకు తంత్రవార్తికమని పేరు. శేషించిన భాష్యముపై రచింప బడిన వార్తికమునకు టువ్ టీక యని నామము. ఈ విస్తృత వార్తిక గ్రంథమే మీమాంసా శాస్త్రసిద్ధాంత ములను ప్రతిపాదించు ముఖ్యప్రమాణ గ్రంథము. ప్రభాకర మిశ్రుడు కుమారిలునికి శిష్యుడని ప్రసిద్ధి. ప్రభాకరుడు అత్యంత సూక్ష్మబుద్ధి గలవాడు. ఒకనాడు పాఠము చదువు సమయమున గ్రంథములో "అశ్రతు నోక్తం తశ్రాఒపీ నో క్తం" అను ఒక పంక్తి వచ్చెను. ఎంత విచారము చేసినను దీని తాత్పర్యము తెలియలేదు. కనుక అనాడు పాఠ మక్కడికే ఆపుదల చేయబడెను. రెండవ నాడు తిరిగి ప్రభాకరుడు తన గురువైన కుమారిలునితో "ఈ వాక్యములో తెలియని విషయ మేమియు లేదు. సులభమయినది. అర్థము తేలికగా నున్నది" అత్ర'తు" నా ఉక్తం" =ఇక్కడ తుశబ్దము మొదలు చేసి చెప్పబడినది. "తత్ర 'అప్పినా ఉక్తం" = అక్కడ ఆపి శబ్దముతో చెప్పబడి యున్నది" అనెను. కుమారిలుడు ఈ చమత్కారగర్భిత P