విజ్ఞానకోశము . ౨ వలయును. వ్యంగ్య చిత్రములను (cartoons), క్షణిక ప్రయోజనములు కలిగిన వస్తువులను గోడలపై చిత్రించ కుండుట చాలా మంచిది. ఎందుకనగా గోడలపైని చిత్రముల సందేశము సార్వకాలికమై యుండవలయు ననునదే చిత్ర కారుని యొక్క యు, భవననిర్మాత యొక్క యు ఉద్దేశమై యుండును. పటములు అప్పటి కప్పుడు మార్చ వీలగును. కాని కుడ్యచిత్రము అట్టివిగావు. వందలు, వేల సంవత్సరముల పర్యంతము కూడ చిత్రములు సురక్షితము లుగా నుండగలవు. కుడ్య చిత్రములలోని వర్ణములు అధిక సంఖ్య కలవిగా నుండుటలో చిత్రకారునికి పెక్కు ఇబ్బందులు గలవు. కావున ప్రాచీన కాలమునుండి ఏ ఐదారు వర్ణములనో మాత్రమే ఉపయోగించు వాచారము ఏర్పడినది. జనుల సందడి గల స్థలములు, దేవాలయములు, ఆఫీ సులు, పురపాలక సంఘములు, లైబ్రరీలు, శిక్షణాలయ ములు, విశ్వవిద్యాలయములు, సభలు, మొదలగు స్థల ములలో ఇట్టి చిత్రములు వేయించవలయును. సభ్యతా ప్రపంచములో వీటికి ఎక్కువ స్థానము కలదు. ప్రాచీన ఈజిప్టు, గ్రీకు, రోము, చైనా, జపాన్, ఇండియా, పర్షియా, మున్నగు దేశములలోని ఆరాధనా మందిర ములలో, గుహాలయములలో, రాజభవనములలో, సమా ధులలో, మఠములలో, నేటికిని ప్రాచీన సభ్యతా చిహ్న ములుగా ఈ చిత్రములను చూచి, ఆ కాలపు చరిత్రను, సభ్యతను మనము వేనోళ్ళ శ్లాఘించుచున్నాము. కుడ్య చిత్రములు మానవుని శిల్పకళా కౌశల్య చరిత్రను బాహో టముగా చాటుననుటలో ఏమాత్రము సందేహము లేదు. కుమారిలభట్టు : S'o. 7. మనుష్యబుద్ధికి అగోచరమై ప్రతిక్షణము రూపాం తరముపొందు విచిత్రమైన ఈజగత్తులో ఆయా పరిస్థితు లనుబట్టి జగదుద్ధరణార్ధమై అపుడపుడు " మహామహి మాన్వితులనేకులు జన్మించి ఆతరులకు అసాధ్యమయిన గొప్పకార్యములు చేసి లోకహితము గావించిరి. ఇట్టి మహాపురుషులలో కుమారిలు డొకడు. కుమారిలభట్టు అతి సూక్ష్మబుద్ధి గలవాడు. సకల శాస్త్రములయందు సంపూర్ణ మయిన పాండిత్యము సంపాదించిన మహావైదిక సార్వ { 747 కుమారిలభట్టు భౌముడు. అమిత ధైర్యముగల వాదిసింహుడు. ధర్మ సంస్థాపనముకొరకు అత్యంత విషమపరిస్థితులయందుగూడ అపూర్వమయిన ఊహలను కల్పించి ప్రతిపదులనోడించి స్వమతస్థాపనచేయు మహా శక్తి గలవాడు. L చార్వాకము, జైనము, బౌద్ధము మొదలయిన సంప్ర దాయముల ప్రాబల్యమువలన ప్రాచీన వైదిక ధర్మము పూర్తిగ లోపించియుండుట చూచి పరితపించి, అతిసాహ సము చేసిన విలక్షణ ప్రతిభాశాలి కుమారిలుడు. ప్రాచీన వై దికధర్మ సంస్థాపనముకొరకు “ధర్మస్య పాదాశ్చత్వారః సత్యం శౌచం దయా తప" అను ప్రమాణవచనము వనుసరించి తన సత్యవ్రతత్వమును చూపి దుస్త్యజమైన ప్రాణములనుగూడ త్యజించినవాడీ మహాత్ముడు. రాజపోషణమున మిక్కిలి అభివృద్ధిపొంది భారత దేశ మందేకాక బ్రహ్మదేశము, త్రివిష్టపము (టిబెట్) చీనా, జపాను, మలయా మొదలయిన దేశములయందుగూడ వ్యాపించిన బౌద్ధమతమునకు చెందిన మహాపండితులతో వాదములు చేసి, వారి నోడించి వైదికకర్మమార్గమును స్థాపించినవాడు కుమారిలభట్టే. "ఆంధ్రో త్కలానాం సంయోగే పవిత్రే జయ మంగళే గ్రామేంతి కే మహానద్యా భట్టాచార్యః కుమారిలు ఆంధ్రజాతి _స్తిత్తిరికో మాకా చంద్రగుణానతీ యజ్ఞేశ్వరః పితా యస్య........" అను శ్లోకమునుబట్టి కుమారిలభట్టు ఆంధ్రోత్కల సంగమ స్థానమందలి జయమంగళ గ్రామమువాడనియు, ఆంధ్ర జాతీయుడనియు, తల్లి సాధ్వియగు చంద్రగుణయనియు, తండ్రి యజ్ఞేశ్వరుడనియు తెలియుచున్నది. ఇదిగాక --- "ఆంధ్రదేశ సముత్పత్తిః ప్రాథాకర పరిశ్రమః | తత్రాపి యాజుషీశాఖా నాల్పస్యతపసః ఫలమ్ ॥ అని అప్పయ్య దీక్షితులవారు చెప్పియున్నారు. ఇందు పేర్కొనబడిన ప్రభాకరమిశ్రుడు కుమారిలునికి శిష్యు డని ప్రసిద్ధి. దీనివలన సాధారణముగ దేశనిర్ణయము ఏర్పడును. శంకరాచార్యులు కుమారిలుని సన్నిధికి వచ్చి యుండిరనునది ఇతిహాస సిద్ధమైన విషయము. కనుక కుమారిలుని కాలము ఇంచుమించు ఏడవ శతాబ్దియని చెప్పవచ్చును.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/800
Appearance