కుమ్మరము ఆకృతిని నిర్మించుటకై నున్నని కొయ్య చెక్కను, చదు నైన రాతిముక్కను, మృణ్మయ పాత్ర యొక్క ఉపరి తలమును చదును చేయుటకై నొక గుల్లక తిని, ఉపరి భాగముపై మెరుగు దిద్దుటకు కరుకైన కుంచేను, మట్టిని తడుపుటకొక నీటి పాత్రను ఉపకరణములుగా కుమ్మరపు పరిశ్రమయందు ఉపయోగించెడివారు. ఈ సాధనములను ఉపయోగించుట ప్రగతి నొందిన నిర్మాణ విధానమై (technique) యుండెను. కుమ్మరి సారెపై మృణ్మయ పాత్రకు ఆకార మేర్పర చుట ఆధునిక కాలమునకు పూర్వమే సాధింపబడిన అత్యుచ్ఛ దశయై యున్నది. ప్రాథమికులయిన ప్రజలు ఈ సాంకేతిక విధానమును ఎంతమాత్రము ఎరుగ రైరి. మట్టిపాత్రను ఎండబెట్టుట, కాల్చుట, మూడవ దశకు చెందిన విధానము, కుండ చేయుటకు ఉపయోగించిన మట్టి యందలి చెమ్మ దానిని ఎండలో కొంత సేపు ఎండించుటచే తొలగిపోవును. అటుపిమ్మట కనీసము 350° C-400° C ఉష్ణోగ్రతగల ఆవములో ఈ మృణ్మయ పాత్రలను కాల్చుటచే అందు లీనమైయున్న నీరు ఇంకి పోవును. కుమ్మరము ప్రాథమికమైన దైవను లేక ప్రగతి - చెందినదై నను అందలి అనేక రకములలో అలంకరణము, రంగు తప్పక కనిపించుచుండును. వీటిలో గీయబడిన మోటు రేఖలు మొదలుకొని అతిశ్రమతో నిర్వహింపబడిన ఉత్తమ చైనా పాత్రలయందలి అలంకరణము వరకును పసుపుపచ్చ, లేక నారింజపండు, లేక ఎరుపురంగు యొక్క మొదలుకొని 'కాంగ్ హింగ్' ముతక లోహమునందు లభించు క్లిష్టమై, సూక్ష్మమయిన రంగు నమూనావరకు మారుచుండును. కుమ్మరమునందలి ఆఖరుదశ మృణ్మయ పాత్రలకు మెరుగునూనె పూయు టయు వాటిని సూక్ష్మరంధ్రములు లేనివిగా చేయుటయై యున్నది. అత్యంత ప్రాచీనులైన పెక్కుమంది కుంభ కారులు ఇట్టి మెరుగునూనెను ఉపయోగించు స్థితికి వచ్చి యుండలేదు. ఆవమందు కాల్చబడిన కుండలు నీటిని పీల్చు కొనవు. కాని అవి కారుటయో, లేక చెమ్మగిలుటయో సంభవించును. అందుకై ఈ పాత్రలకు మెరుగునూనె పూయుదురు. ఈ మెరుగునూనె శోభనొసగుచు ప్రయో జనకారీ యగుచున్నది. కుండలకు పూయదగిన మెరుగు 752 నూనెకు సంగ్రహ ఆంధ్ర . బగులు ప్రాచీనులు దేవదారు గుగ్గిలము సగ్గుబియ్యపుగంటి - ముండ్ల జెముడు రసమును తదితర పదార్థములను ఉపయోగించిరి. మెరుగునూనె పూయుట వలన లేక మరుగు ఇచ్చుటనలవ మృణ్మయ పాత్రలకు ఒక చనుత్కారమయిన సౌందర్యము అబ్బినను, తన్మూల మున అంతగా ఉపయోగము చేకూరజాలదు. ప్రపంచమున కాననగు భిన్న సాంకేతిక విధానములను బట్టి అనేక ప్రాంతములలో స్వతంత్రముగా కుమ్మర ము కనిపెట్టబడినట్లు సాధారణముగ విశ్వసింపబడుచున్నది. మృణ్మయపాత్ర ఉత్పత్తిని గూర్చిన వాదములనేకములు కలవు. అవి కేవలము నమ్మదగినవి కావు. ప్రాచీన మానవుడు సూక్ష్మరంధ్రములు లేకుండుటకై తట్టలకు, బుట్టలకు మట్టిని పూతగా పూసెననియు, అవి ఆకస్మికముగ నిప్పంటుకొనగా మిగిలిన మట్టికుండ అతనికి మృత్పాశ్ర నిర్మాణకళను సూచించెననియు చెప్పబడుచున్నది. ఈ వాదన అంతతృప్తి కరముగా లేదు. ఎండుచేతననగా, మట్టితో పూయబడిన బుట్ట కాలినంతమాత్రముననే అది కుండకాజాలదు. చక్కగా పాత్రకరీరమును చేయుట, దానిని ఎండబెట్టుట, దానిని అనుకూలపరిస్థితులలో అవనుందు కాల్చుట మొదలగు కార్యకలాపములు పెక్కులు జరిపిన నేగాని సిసలై నకుండ తయారుకాదు. కుమ్మరము-చరిత్రయందును, పురావస్తుశాస్త్రమునందును దావి ప్రాముఖ్యము : కుమ్మరము ప్రతిదేశము యొక్క పురావస్తు శాస్త్రము యొక్క ప్రధానమైన వర్ణమాల యని పిలువబడినది. మృణ్మయపాత్ర మిక్కిలి సులభముగ పగిలెడి స్వభావము గలది. అందుచే, రానున్న తరముల వారికి సామాన్యములై, అనలంకృతములైన రకములను తప్ప తదితరములైన మృణ్మయ పాత్రలను అనుకరించుట. ఉపయోగించుట సాధ్య పడదు. మృణ్మయపాత్రలలోగల వైవిధ్యము అసమానమై యున్నది. ఒక్క ఈజిప్టు దేశముయొక్క పూర్వ చారిత్రక యుగమందే కుమ్మరమునందు సుమారు వేయి భిన్న రూప ములు కలవు. అనుభవమునుబట్టి చూచినచో మట్టిపాత్ర నశ్వరముకాదు. కాలము గడచినను, లోహపాత్రలవలె మృణ్మయపాత్రలు లేక ' ముతకలోహములు చెడిపోవు. భూగర్భశాస్త్ర వేత్త గత ప్రపంచ చరిత్రమ నిర్మించుటకు "
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/805
స్వరూపం