Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/797

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుడ్యచిత్రణము పూత ఆరగానే దానిని "అకీకు" రాతితో (పాలిషుచేయు రాయి. ఇది అంగుళమునుండి అంగుళమున్నర వరకు పొడవు. అర అంగుళము వెడల్పు గలిగి అంచులు గుండ్ర ముగా నుండి గుమ్మడిగింజ యొక్క ఆకృతిగలిగి యుండ వలయును) అణచవలయును. ఇట్లు రెండు మూడు పర్యాయములు ఒ త్తవలయును. పై పొరమీద పాలిషు రాకుండునట్లు సున్నపుకోటింగు(coating) నియ్యవలయునే కాని పాలిషు చేయగూడదు. పాలిషు చేసినచో చిత్రము బాగుగా రాదు. ఇప్పుడు చిత్రభూమిక సంపూర్ణముగా తయారైనది. సంపూర్ణముగా తయారైన భూమికపై కెమికల్ రంగులు (chemical colours) పనికిరావు. అనగా సున్నముచే, వెలుతురుచే బాధింపబడు వర్ణములు త్యాజ్యములు. భూమినుండి లేక రాతినుండి తీసిన రంగులే పనికివచ్చును. ఇటాలియన్ ఫ్రెస్కోలలో వాడబడు రంగులన్నియును దీనికి పనికివచ్చును. చిత్రించుటకు పూర్వము అవసరమైన రంగులన్నిటిని ఒక్కొక్కటిగా సున్నముతో కలిపి యుంచవలయును. కుంచెతో భూమిక పైనైనను, లేనిచో కాగితముపై నైనను రేఖాచిత్రమువ్రాసి, గుండుసూదులచే సన్నని బొక్కలు పొడిచి, సన్నని బొగ్గుపొడిని మూటగట్టి, భూమికపై పరచి, మూటచే కాగితముపై ఒకటి రెండు సారులు కొట్టి తీసినచో, చిల్లులనుండి పొడి, భూమికపై వ్రాలి ఆకృతి ఆకృతి విశేషములను తెలుపును. కుంచెచేత మొదట వలుచని రంగులను నీటిభాగ మెక్కు వగునట్లు కలిపి దానిపై వేయనగును. వెంటనే నీరు ఇంకిపోవు చుండుము. మరొకసారి రంగును వేసి ఆరగానే తిపాయిచే (ఇదొక చిన్న తాపీ) రంగు భాగమును అణచవల యును, రేఖలు వేయవలసినచో పాలిషు చేయుటకు ముందే వేయవలయును. అన్ని వర్ణములు తొందర తొందరగా వేసిన తరువాత ఆరక పూర్వము, తిపొయిచే జాగ్రత్తగా వత్తుచు కొంచెము కొంచెము పొలిషుచేయుట కారంభించవల యును. పాలిషు అకీక్ రాత్రిచే చేయుట ఉచితము. పొలిషు రాయియందైనను, తిపాయియందైనను ఏమా త్రమును కరకుదనము ఉండకూడదు. లేనిచో చిత్రము భేదింపబడును. చిత్రము ముగియగానే అదేరోజు కొబ్బరి 744 సంగ్రహ ఆంధ్ర కుడుకపై పొట్టును నులిపి నీటితో రంగరించి, ఆనీటిని కొబ్బరితో నుడికించి రంగులేని మల్ ్మల్ గుడ్డచే అచ్చ టచ్చట చిత్రమును తడిపి ఆ మల్ మల్ గుడ్డనే ముడు తలు లేకుండ మడతబెట్టి వెంటనే తుడిచి వైచి దానితో చిత్రముపై పాలిషు చేయదగును. తరువాత అకీకు రాతిచే మరల పాలిషు చేయదగును. అప్పుడు చిత్రము అద్దమువలె మెరయును. నీటిచే ఏమాత్రము రంగులు పోజాలవు. కొన్ని సందర్భములలో సన్నని మొలతో గీతలు గీచి, తెల్లని రేఖలు వేయు ఆచారముగూడ కలదు. ఎండిన తదుపరి నల్లని గీతలుకూడ అవసరమైనచో బంక నీటి సహాయముచే వేయుట గలదు. ఈ విధానమందు అతిజాగ్రత్త వలయును. శ్రమకూడ కలుగును. కాని చిత్రములు మాత్రము మెరుగు కలిగి చాలాకాలము మనగలవు. వీటిలో నుపయోగించు నలుపురంగు, మసితో చేసిన దైనచో, బాగుగా నుండును. ఈ నలుపుపొడిని నీటితో కలుపకూడదు. బంక నీటితో కొంచెము కొంచెము | వేలితో రంగరించి, కలిపి యుంచవలయును. తెలుపు రంగు నిమి తమై సున్న మే ఉచితమైన వర్ణము. అనేకులు అజంతా విధానమును ఫ్రెస్కో యని అనుచుందురు. కానీ అది ఫ్రెస్కో విధాన మెన్నటికిని కాజాలదని ఆపద్ధతి నెరిగిన వారు తెలిసికొనగలరు. అజంతా విధానములో ఈ క్రింది విధముగా భూమి కను సిద్ధముచేసినట్లు ప్రవీణులైనవారు తలచుచున్నారు. పెండ = ఓ తట్ట వీటిని బాగుగా కలిపి పుట్టమన్ను = తట్ట 15 దినములు నానబెట్టుచు, ఉముక (వరిధాన్యపు రోజు ఆరకుండ నీరు పోయు పొట్టు)=౪ తట్ట చుండవలయును. ఇట్లు చేయు టచే, మిశ్రణము మురిగి జిగట ఏర్పడును. మెంతిపొడి చంచా ఈ మిశ్రణమును రెండు భాగములుగా జేసి ఒక భాగ ములో నారపీచును తునుకలుగా జేసి బాగుగా కలుప వలయును. "Carrier" భూమి రాయియైనచో దానిని బొక్కలు గొట్టి బరుసుగా చేయవలయును, దానిపై నార కలిపి యుంచిన మిశ్రణమును ఒక అంగుళపు మందము వేసి,