విజ్ఞానకోశము - . ఇట్టి చిత్రములు వేయు సందర్భమున నాలుగు విషయ ములు ముఖ్యముగా గమనింపదగి యున్నవి. (1) Carrier [ప్రధానభూమి (గోడ)], (2) భూమిక (రంగులు వేయు ప్రదేశము) (8) రంగుపదార్థములు (చిత్ర ములువేయు పదార్థములు) (4) బైండింగు మీడియము - (అతుకు పదార్థము—— The means by which the pigments are attached to the ground so as to make the work firm and lasting). సున్నపు గోడ పై వేయు చిత్రములు పలుచనిపొరలుగా విడివడును. సిమెంటు గచ్చుపై వేసినచో అది నీటిని గ్రహించి భూమి కను పట్టజాలదు. కావున తదుపరి బెత్తికలుగా ఊడిపడును. గచ్చుచేసినచో గోడలలో సందులులేకుండ చేయవలెను. అట్లు చేయనిచో, గోడలలో గాలి నిలిచియుండి ఎప్పు డైనను ఆభాగము ఊడిపడు ప్రమాదము సంభవించ వచ్చును. గిలాబ (plaster) లో సిమెంటు పరిమాణము కొంచెముగానుండి ఇసుక ఎక్కువై యుండును. ఇట్టి భూమిపై గిలాబవేసినచో నీటిని లో నున్న ఇసుక గ్రహించ గలుగును. కాని సిమెంటు జా స్త్రీయైనచో దానికి నీటిని గ్రహించుశక్తి యుండదు. ఎట్టిసున్నము ఉపయోగార్హముగ నుండునో అట్టి సున్న మును తయారుచేయు విధ మెట్టిదో తెలిసికొనుట ముఖ్యము. తాంబూలములో నుపయోగించు సున్నము లేక ఇంటికివేయు సున్నము వాడనగును. సున్నపు రాళ్ళను ఒక్కొక్కటిగా నేరి నీటికుండలో కట్టెతో కలుపుచుండవలయును. దీనివలన రాళ్ళన్నియు ఉడికి, విచ్చి మంచిగా సున్నము నీనును. రాళ్ళన్నియు ఒకే సారి వేసినచో లోనచేరి గట్టిగా ముద్దకట్టును. సున్నమును ఒక సంవత్సరము పొతదిగా చేయవలయును. ఎక్కువ కాల మైనచో సున్నము మిక్కిలి మంచిదిగా తయారగును. కుండలోనున్న సున్నపునీటిని రెండు లేక నాల్గు దినముల కొకసారి పారబోసి క్రొత్తనీటిని నింపి కలియబెట్టుచుండ వలయును. ఇట్లొక సంవత్సరము నిరంతరము చేయవల యును. దీనివలన రంగును తిసుకకి నశించి కేవలము ఒక తెల్లని జిగురుగఅ రంగుగామాత్రము తయారగుమ. ఎంత పొతసున్న మైన నంత మంచిది. రంగులో ఎక్కువక లిపినను నష్టము వాటిల్లదు. సున్నము ఒక సంవత్సరమునకు తక్కు - 743 కుడ్యచిత్రణము వది యైనచో రంగు పలుచన అగుటయేగాక భూమిలో పగుళ్ళు ఏర్పడును. సున్నములో కలుపుటకు జయపురపు చిత్రకారులు జయపూరు దగ్గరనున్న మక్రానా చంద్రకాంత శిలలగని యందలి రాళ్ళపొడిని (Marble dust) ఉపయోగించు చున్నారు. దీనినిజయపుర ప్రాంతములలో "ఆరస్ "అందురు. గోడపై భూమికను వేయుటకు పూర్వము సహజముగా భూమిక పైనను, ఇటుక పైనను, మందపు ఇసుకతో " నుండి 1॥ మేరకు సున్నపు మిశ్రమముతో చదును చేసి దాన్ని పై వెంటనే జల్లెడపట్టిన చంద్రకాంతశీలపొడిని పై సున్నమును 4:1 పరిమాణములో కాగుగా కలిపి తాపీచేయవలయును. (మందము 1" లేక "). అన్ని మూలలు గట్టిగానదిమి నింప వలయును. దీనిని చదునైన "కిడ్” కఱ్ఱముక్కతో తడు పుచు చదును చేయుదురు. ఈ నీరు క్రిందిప్లాస్టరు వరకు జారి రెండు భూమికలు ఒకటియగును. ఇట్లు కొంత సేపు చదునుచేయుటచే భూమితడి కొంచెము ఆరిపోవును. తరు వాత చదునైన బరువు రాతితో దానిపై చదునుచేయుట వలన లోనున్న గాలి బయటికివచ్చి భూమి గట్టియగును. సున్నము రాయి కంటుకొనుట మాని రాయి అవలీలగా తిరుగులాడిన యెడల పై భాగము క్రిందిభాగముతో ఏక మై నట్లు భావించవలయును. అప్పటికిని లోన గాలియున్నట్లు అనుమాన మున్నచో, భూమిపై తాపీ యొక్క అంచుతో చిన్న చిన్న దెబ్బలుగొట్టి కీమా చేసి మరల రాతితో చదును చేయవలయును. ఇట్లు చేసిన తరువాత సున్న మును, పాలరాతి పొడిని పై ప్రమాణములో గలిపి చదు నైన రాతిపై వేసి నూరవలయును. దీనిచే "ఆరస్" (చంద్రకాంతశిలపొడి) మిక్కిలి సన్ననిదగును. ఈ మిశ్ర మును కుంచేచేత పలుచగా రెండు మూడు పర్యాయ ములు భూమికపై పూయవలయును. తరువాత మరల చదును రాతిచే అణచి చదునుచేయదగును. ఈ భూమి కొంచెము ఆరగానే బాగుగా వడియబోసిన సున్నముచే పలుచగా రెండు మూడు పూతలు కుంచెతో పూయ వలయును. పనిలో ఎంత చిన్న ఇసుక రేణువు కలిసినను పాలిషు చేయునపుడు చిత్రమును చెరచివేయుచుండును. పై సున్నపుపొర మందము (Thickness of film) ఒక దారపు మందమును మించి యుండగూడదు. ఒక
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/796
Appearance