Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ మూడురోజులవరకు ఆరబెట్టి యుంచినచో భూమిక ఎండి, దానిలో కొన్ని పగుళ్ళు ఏర్పడును. రెండవ మిశ్రణమును దానిపై వేసి " మందము చదును చేయవలయును. పగు ళ్ళను దీనిచే బాగుగా పూడ్చవలయును. భూమికను బాగుగా చదును చేయవలయును. ఈ భూమికపై అజం తాలో, శంఖభస్మముతో జేసిన తెలుపురంగును బెల్లపు నీటితో కలిపి భూమికపై వేసినట్లు తెలుపుచున్నారు. నేటి కాలములో "Zinc white" ను కూడా వాడనగును. రంగులలో, నలుపును మసితోను, తెలుపును శంఖ భస్మముతోను, ముత్తెపు చిప్పలను, కౌచిప్పలను కాల్చిన తెలుపుతోను చిత్రించవచ్చును. ఇతర వర్ణములలో మట్టి రంగులు Cochre colours), పసుపు, ఆకుపచ్చరాయి (Terre verte) జాజులోని వివిధచాయలు ఉపయోగించి నట్లు కలదు. నీలపు రంగునకై పర్షియా దేశమునుండి దిగుమతియగు (Lapislazule) “లాపిస్ లాజూల్ "ను ఉపయోగించు చుండినట్లు చరిత్రకారులు వ్రాయు చున్నారు. మొదట జాజు రంగు చేత రేఖలు వ్రాసి, దానిపై రంగులు వేయుచుండేడివారని కొన్ని అసంపూర్ణ చిత్ర ములనుండి 'తెలియుచున్నది. ప్రాచీన కాలములో అనేక కుడ్య చిత్రరీతులుండినట్లు విష్ణు ధర్మోత్తరమునుండియు, కొచ్చిను ఫౌ త్తిచిత్రములవల నను తెలియుచున్నది. విష్ణుధర్మోత్తరమునందున్న విధా నము ననుసరించి రేగడిమట్టితో లేక పుట్టమట్టితో ఇటిక . పొడినికలిపి చేయు వాడుకయున్నట్లు తెలియుచున్నది. రేగడిమట్టితో మూడువిధములగు ఇటికపొడిని శ్రీ భాగము కలిపి యుంచవలయును. కుంకుమపూవు (Saffron) ను అవిశెనూనెలో కలిపి వేరుగా నుంచవలయును. దీనిలో 9 గుగ్గిలము (gumresin), తేనెటీగల మైనము (Bees waz), గురిజగింజలు(lequorice). బెల్ల పునీరు (molasses) ముడ్గ (mudga) "ఓటానా గింజలు" సమభాగములుగా కలిపి, శ్రీ భాగము ఎండిన కరక్కాయలు (burnt - yellow myrolealan) ముక్కలు చేసి కలుపవలయును. చివరకు లవంగతై అమునైనను కలుపవలయును. దీనిచే అన్ని రకముల వినాశకర కీటకములు చచ్చును. దీనిని 2:1 నిష్పత్తిలో కలుపవలయును. ఒక భాగము ఇసుకను చేర్చవలయును. ఇసుక ప్రమాణము మొత్తము మిశ్రము 94 745 నకు సరిపోవు రీతిగా నుంచవలయును. కుడ్యచిత్రణము ఈ మొత్తము మిశ్రమును నీటిలో కలిపి, కరిగించి బాగుగా మర్దించి ఒక నెల పర్యంతము తడిగా జాగ్రత్తగా నొకచోట భద్రపరచ వలయును. చిత్రకారుడు ఈ మిశ్రము ఎండిన తరువాత ఈ (తడి యారక ముందు) గోడపై పూసి, చదునుచేయ వలయును. ఏ మాత్రము బొక్కలు క్రిందు మీదులు గాకుండునట్లు పూత పూయవలసి యుండును. ఎక్కువ మంద ముండరాదు. మిక్కిలి పలుచగా నుండరాదు. ఒకసారి చదును చేసిన తరువాత పగుళ్ళు పాసినను, మరే మైనను, పూర్తిగా ఎండిన తదుపరి అదే మిశ్రమును మరొకసారి ఆయా ప్రదేశములందు పూసి చదునుచేసి, నున్నగా చేయవలయును. ఇట్లు రెండు మూడుసార్లు సాలవృక్షము (Shorea robusta) నుండి తీసిన బంకతో కలిపిన తైలములో మిశ్రమును గలుపుచు, నునుపుగా భూమికను తయారు చేయవలయును. అప్పుడప్పుడు నీరు చల్లుచు పాలిషు చేయుచుండవలయును. ఈ విధముగా భూమికను సిద్ధము చేసినచో నూరు సంవత్సరముల వరకు గూడ చిత్రములు చెదర నేరవని విష్ణుధర్మోత్తరకారుడు వ్రాసియున్నాడు. కొచ్చిన్ భిత్తిచిత్రములు దాదాపు ఫ్రెస్కో పద్ధతి ననుసరించి వేయబడినవని తెలియుచున్నది. కానివాటిలో అతుకులు కనబడనందున ఆ పద్దతి కాదేమోయని సందేహ ములుకూడ కలిగినవి. ఇటాలియన్ ఫ్రెస్కోకును వీటికిని భేదము ఒకటిగలదు. ఇటాలియనులు చంద్రకాంతశిల పొడిచే భూమికను సిద్ధముచేసిరి. కాని కొచ్చిన్, పద్మనాభ పురము, తిరువానూరు, మొదలగు తావులయందలి భూమి కలు సున్నము, ఇసుకతో చేయబడినవని తెలియుచున్నది. జయపురసంస్థానములో ఒక సాంప్రదాయపు భి త్తిచిత్ర కారునివలన ఒక పద్ధతి తెలియవచ్చినది. అతడు చెప్పినవిధ ముగా ఒక తట్టనిండ పాతసున్నము (ఒక సంవత్సర పర్యం తము నానినది) ను తేనెకున్న పలుచగా జేసి, వడియబోయ వలయును. దానిలో నొక అర్ధపావు బంకమట్టి (శుభ్ర మైనది) ని చిన్న చిన్న ఉండలు (సెనగగింజల ప్రమాణము కన్న కొంచెము పెద్దవి) చేసి వేయవలయును. ఈ మిశ్ర మును ఒక గట్టికుండలో వేసి, ఆ రోజంతయు నొక తెడ్డుతో ఎడ తెగకుండా కలియబెట్టవలయును.