Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/792

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ఆదాయపు మట్టములో పెరుగుదల కన్పట్టినపుడు వినియోగ శక్తియందుకూడ వృద్ధి కన్పించుట నిజమే యైనను వినియోగశక్తియందు ఎంత అభివృద్ధి కలిగినది. అను విషయము తెలిసికొనుట ఆవశ్యకము. ఆదాయము 50 శాతము పెరిగినదనుకొనిన, వినియోగళ క్తికూడ అంత శాతము పెరుగదు. సమాజమునందలి బీదజనులు తప్ప తక్కిన తరగతుల జనులందరు వారి రాబడిలో కల్గిన పెరుగుదల నంతను వెనువెంటనే పూర్తిగా ఖర్చుచేయరు. ఆదాయము పెరిగినపుడు ఆదాయపు పెరుగుదల శాతమంత వినియోగశక్తి పెరుగుదల శాతముండదు. నిల్వల శాతము హెచ్చును. మన ఆర్థిక వ్యవస్థయందలి అనేక శ క్తులతో పోల్చి చూచినచో వినియోగశక్తి అంత చంచలమైనదిగారు. దీనికి కారణము గలదు. వినియోగ. శక్తి సామాజిక నిర్మాణము, సాంఘిక పద్ధతులు, మానవ స్వభావము, మన స్తత్వరీతులు అను అంశములపై ఆధార పడియుండును. ఏదేని ఒక సాంఘిక విప్లవము, విపరీతమైన ద్రవ్యోల్బణము, ఇతరములైన ఇట్టి అసాధారణ పరిస్థితులు ఏర్పడినగాని సాధారణముగా పై ని చెప్పబడిన అంశములు అంత సులభముగా మారునవిగావు. కావున వినియోగ శక్తి చాలవరకు స్థిరమైనది. ఇక నిల్వలు ఆదాయపు పరి మితులపై ఆధారపడియుండును. బీదలకు నిలువచేయు టకు తగిన అస్కారమే ఉండదు. ధనిక వర్గములలో హెచ్చుసొమ్ము నిల్వచేయుటకు వీలుండును. రాబడి పరి మితి వృద్ధి యగుచున్న కొలది నిల్వల శాతము హెచ్చు చుండును. కావున సమాజపు మొత్తము ఆదాయములో కానీ సమాజమునందలి వి త్తపు విభజనయందుకాని మార్పులు రానియెడల ఆ సమాజపు మొత్తము నిల్వల యందును మార్పుండదు. వినియోగళక్తి ఎంత స్థిర మైనదో పెట్టుబడి అంత అస్థిరమైనది. ముందుముందు ఎంత సరకు అమ్ముడుపోగలదని పారి శ్రామిక వేత్తలు ఊహింతురో ఆ ఊహ పై ఆధారపడి పెట్టుబడి ప్రవర్తిల్లును. భవిష్యత్తున సంకుచితమగు విపణి ఎదురగునని వారూహించినచో ఎంత తక్కువ వెలకు వారికి మూలధనము లభించినను, అనగా ఎంత తక్కువ వడ్డీ రేటున్నను నారు ఉత్పత్తిని అధికము చేయజాలరు. ఈ సందర్భమున మూలధనపు అంత్య సామర్థ్యము (The 739 కీన్సు. జె. యం. Marginal efficiency of Capital) అను సాంకేతిక పదమును కీస్సు అర్థశాస్త్ర పరిభాషకు చేర్చెను. ఏదేని ఒక పరిశ్రమయందు ప్రస్తుతము 'ఎక్సు' పరిమితిగల మూల ధనము కలదనుకొందము. మరియొక క్రొత్త యూనిట్ మూలధనము పరిశ్రమకు చేర్చబడవలెనన్న రానున్న కాలములో ఈ క్రొత్త యూనిట్ మూలధనముపై తమకు ముట్టగలదని పారిశ్రామిక వేత్తలు ఊహించు ప్రతిఫలము వడ్డీకన్న హెచ్చుగా నుండవలెను. అది హెచ్చుగా నున్నంత కాలము పరిశ్రమలయందు మూలధనము హెచ్చుచునే యుండును. అవి రెండును సరిసమాన మయి నపుడు పరిస్థితులు నిశ్చలస్థితియందుండును. పెట్టుబడి వృద్ధిచేయబడినపుడు ఎంత ఎక్కువ పెట్టు బడికి ఎంత ఎక్కువ జాతీయాదాయము లభించును అను ప్రశ్నకు కీన్సు ఒనగు జవాబు ఆతని ఆర్థికాభి ప్రాయము లలో మిగుల ముఖ్యమైనవానిలో ఒకటి. ఒక పారి శ్రామిక వేత్త తన పరిశ్రమలయందు ఒక క్రొత్తయంత్ర మును ప్రవేశ పెట్టుచు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసిననుకొందము. ఈ యంత్రమును పనిచేయించుట యందు అతనిచే నియమింపబడిన శ్రామికులు, ఈయంత్ర మును ఆతనికి అమ్మిన కంపెనీవారు, వారివారి ఉత్పత్తి సాధనములతో పరిశ్రమలో అతనికి సహాయపడు అనేకులు -- వీరందరికి 10 లక్షల రూపాయలు చేరును. పారిశ్రామిక వేత్త వ్యయము వీరికి రాబడి. వారివారి ఆదాయముల వారందరు తిరిగి ఉపభోగ్యవస్తువుల (Consumer goods) కొనుటకై ఖర్చు చేసినచో అసొమ్మంతయు ఆవస్తు వుల వి క్రేతలకు చేరును. ఇట్లు ఒక పదిలక్షల రూపాయల ప్రాథమిక వ్యయము అనంతముగా వృద్ధి చెందవచ్చును. కాని ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి సాధనములు వినియోగింపబడు మేరకును దానికిని ఒక హద్దుండును. మొదటి 10 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయల `మొత్తము ఆదాయము అగువరకు వృద్ధిచెందినచో ఆదా యపు గుణకము (Multiplier) 4 అని అందుము. పెట్టు బడి హెచ్చుచేయబడినపుడు జాతీయాదాయపు పెరుగు దల పెట్టుబడి పెరుగుదలంత మాత్రమే ఉండక ఆదా యవు పెరుగుదల పారిశ్రామికుని ప్రాథమిక వ్యయము నకు కొన్ని రెట్లుండునని ఈ ఆదాయపు గుణకమున