Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీస్సు. జె. యం. మాంద్యపు గడ్డురోజులలో సంయుక్త రాష్ట్రములందు 15 మిలియన్ల నిరుద్యోగులుండిరి. ఉద్యోగార్థులు అయిన వారంద రికి "ఖాళీలు లేవు" అన్న ప్రకటనలే ఎల్లెడల ఎదురైనవి. ఈ నిరుద్యోగ సమస్యకు కారణమేమి? మన పెట్టుబడి దారీ విధానమున ఆర్థికశక్తుల భ్రమణపు విరాడ్రూప మును కీన్సు ఇట్లు వర్ణించెను : ఏ ఆర్థిక విధానమునం దైనను ఆదాయము వర్తుల న్యాయమున ప్రవర్తిల్లును. ఒకరి రాబడి వేరొకరికి వ్యయము ; వేరొకరి రాబడి మరియొకరికి వ్యయము. సమాజము యొక్క మొత్తము అపేక్షయందు తగ్గుదల కనిపించినచో ఆదాయ ప్రవాహము సంకుచితమైనదని అర్థము. ఎవరో విత్తమును వినియోగ పరంపర నుండి తొలగించి రాబడి ప్రవాహము యొక్క గమనమునకు అవరోధము కల్పించిరన్నమాట. ఎవరు ? ఎందులకు ? వినియోగదారులచే ఖర్చు చేయబడిన సొమ్మంతయు ఆదాయ ప్రవాహమునే చేరును; తాత్కాలికముగనైనను నిలుపుచేయబడినది, నిల్వచేయబడిన సొమ్మే. వ్యక్తి గత మైన పొదుపు ఫలితముగా ఏర్పడిన నిల్వలన్నియు మూలధన రూపమున పారిశ్రామిక రంగములో తిరిగి ఖర్చు పెట్ట బడునని సాంప్రదాయికార్థికశాస్త్రవేత్తలు అభిప్రాయ పడిరి. ఈ భావమును కీన్సు ఖండించెను. పొదుపరితనముతో ధనమును విలువచేసిన వారును పరిశ్రమలకు పెట్టుబడి ధనమును సమకూర్చిన వారును ఒకరుకారు. మధ్యతరగతి ఉద్యోగిగా నేను నా నిల్వధనమును భీమా కంపెనీ రుసు ముగా కాని బ్యాంకులో డిపాజిట్టుగా గాని ఉంచుకొన వచ్చును. జాతియొక్క ఇట్టి నిలువ అంతయు పరిశ్రమ లలో వినియోగించబడి, ఉత్పాదకశక్తులు అతిశయించు ననియు, ఉపభోగ్య వస్తువులు వృద్ధిపొందుననియు చెప్పుటకు ఉపభోగ్యవస్తువులు రుజు వేదికలదు ? నిల్వలు (Savings), పెట్టుబడి (Invest- ment) ఎట్లు సమమగునో సాంప్రదాయికార్థిక వాదులు నిరూపించి యుండలేదు. ఏ.ఆర్థికశక్తుల గమనమువలన అవి రెండును సమమగునో ఆ పథమును పూర్తిగా వివ రించినవాడు కిస్సు. ఒక జాతీయ ఆర్థిక విధానము నందలి ఉత్పాదక శక్తులన్నియు పూర్తిగా వినియోగింపబడ' నంతవరకు, సంపూర్ణ ఉద్యోగస్థితిని ఆ సమాజము అందుకోనంతవరకు, సంగ్రహ ఆంధ్ర ముందు ఆదాయపు మట్టములు హెచ్చుటవలన, వినియోగ శక్తి, పెట్టుబడి పరిమితి, నిల్వల రాశికూడ పెరుగును. వీటి మధ్యగల సంబంధమును ఇట్లు సూచింతుము--- (i) ఎప్పుడును ఆదాయము నుండి వినియోగింపబడిన ధనమును తీసివేయుట వలననే నిల్వల రాశి వచ్చును. (2) హెచ్చిన ఆదాయపుమట్టము, వృద్ధిచెందిన వినియోగ శక్తి పెట్టుబడి పరిమితులు మొత్తమునకు సమానము. (3) మరియు హెచ్చిన ఆదాయపుమట్టము వృద్ధిచెందిన వినియోగశక్తి నిల్వల మొత్తమునకును సమానము. (4) కావున హెచ్చిన పెట్టుబడి పరిమితి హెచ్చిన నిల్వల రాశితో సమమగును. ఉద్దేశింపబడిన నిల్వలు ఉద్దేశింప బడిన పెట్టుబడి పరిమితికి, సమానమైనప్పుడు మన వ్యవస్థ నిశ్చల స్థితిని పొందును. క్లాసికలు అర్థశాస్త్రవేత్తలు ఊహించిన దానికిని కీన్సు వివరణమునకును చాలా భేదము గలదు. సంపూర్ణ ఉద్యోగస్థితి అందుకొనని ఆర్థిక వ్యవస్థలో ఆదాయపు మట్టములు హెచ్చుటవలన, వినియోగశక్తి, నిల్వల రాశి, పెట్టుబడి పరిమితి పెరిగి, అభివృద్ధిచెందిన నిల్వలరాళి, అభివృద్ధి చెందిన పెట్టుబడి పరిమితితో సమాన నుగునట్లు ఆర్థిక శక్తులు ఎట్లు గమనించునో ఆ పథమును ఆతడు వివరించెను. కానీ, సంపూర్ణ ఉద్యోగ స్థితిని పొందిన ఆర్థిక సమాజమును ఊహించి అందు ఎల్లప్పుడు నిల్వల రాళి పెట్టుబడి పరిమితికి సమమగునని మాత్రము సూచించి వాస్తవ పరిస్థితులకు సుదూరమైన వారి ఊహా నిర్మిత వ్యవస్థలో వాస్తవమైన నిరుద్యోగ సమస్యను విస్మరించిన వారు క్లాసికల్ అర్థశాస్త్రవేత్తలు. తమ సిద్ధాంతములకు సంప్రదాయ వాదమునకు తారతమ్యము గమనించ లేని వారిని కీన్సు ఇట్లు హెచ్చరించెను. "నేను వారిని సరి క్రొత్త అంగీని తొడుగుకొనుమనుచున్నానని పాత పద్ధ తుల బడిలో చదువుకొన్న వారికి తెలియకున్నది. పాత అంగినే చిత్ర విచిత్రాలంకరణచేసి, వారికి అందించు చున్నానని వారు భ్రమపడుచున్నారు.” 738 ఆదాయపు మట్టములను హెచ్చుచేయు రీతిని రాబడి హెచ్చుచేయబడుటవలన, వినియోగశక్తిలోను, పెట్టుబడి లోను, కల్గు మార్పుల పరిమితిని ఈ కార్యక్రమముల నన్నిటిని ప్రభుత్వము నిర్వహించవలసిన విధానమును, బాధ్యతను కీన్సు ఇట్లు వివరించెను.